BRS: ఈనెల 12న కరీంనగర్‌లో ‘కదన భేరి’ సభ: కేటీఆర్‌

లేఅవుట్ల క్రమబద్దీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌)పై బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ధర్నా చేయాలని భారాస శ్రేణులకు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ పిలుపునిచ్చారు.

Published : 05 Mar 2024 16:27 IST

సిరిసిల్ల: లేఅవుట్ల క్రమబద్దీకరణ పథకం (LRS)పై బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ధర్నా చేయాలని భారాస శ్రేణులకు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ (KTR) పిలుపునిచ్చారు. కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గం భారాస నేతలతో ముస్తాబాద్‌లో ఆయన సమావేశమయ్యారు. సిరిసిల్లలోనూ ఎల్‌ఆర్‌ఎస్‌పై నిరసన తెలపాలన్నారు. భారాస ఇచ్చిన ఉద్యోగాలపై కాంగ్రెస్‌ ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు. డిసెంబర్‌ 9న అన్ని హామీలు నెరవేరుస్తామని రేవంత్‌రెడ్డి మాట తప్పారని చెప్పారు. కరీంనగర్‌కు బండి సంజయ్‌ చేసిందేమీ లేదని, మతం.. అయోధ్య పేరు చెప్పి ఓట్లు దండుకోవాలని భాజపా చూస్తోందని విమర్శలు గుప్పించారు. ఈ నెల 12న కరీంనగర్‌లో ‘కదన భేరి’ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని