YSRCP: వైకాపాకు గుడ్‌బై చెప్పిన కర్నూలు ఎంపీ సంజీవ్‌ కుమార్‌

అధికార వైకాపాలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది.

Updated : 10 Jan 2024 21:09 IST

అమరావతి: అధికార వైకాపాలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తాజాగా ఆ పార్టీకి మరో నేత గుడ్‌బై చెప్పారు. వైకాపా ప్రాథమిక సభ్యత్వం, కర్నూలు ఎంపీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు సంజీవ్‌ కుమార్‌ తెలిపారు.

బుధవారం విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘కర్నూలులో వలసలు, ఆత్మహత్యలు ఆగాలనేది నా లక్ష్యం. కర్నూలు నుంచి బళ్లారి వరకు జాతీయ రహదారి సాధించాలి. నా పరిధిలో ఉన్నంత వరకు నేను చేశా. వలసలు ఆగాలంటే పెద్దస్థాయిలో నిర్ణయాలు జరగాలి. అపాయింట్‌మెంట్‌ కోరితే ఎందుకు కష్టపడతావన్నారు. ఏ పార్టీలో చేరాలనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. నా సన్నిహితులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటా. మరో 20 ఏళ్లు ప్రజా జీవితంలో ఉంటా’’ అని వివరించారు. కర్నూలు పార్లమెంట్‌ వైకాపా ఇన్‌ఛార్జి పదవి నుంచి సంజీవ్‌ కుమార్‌ను తప్పించడంతో మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని