Kesineni Nani: పార్టీలకు అతీతంగా ప్రజల కోసం వాలంటీర్ల వ్యవస్థ ఉండాలి: ఎంపీ కేశినేని నాని

వాలంటీర్ల వ్యవస్థ పార్టీలకు అతీతంగా ప్రజల కోసం పని చేయాలని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. ప్రజల కోసం పనిచేసే ఏ వ్యవస్థ అయినా మంచిదే అని అభిప్రాయం వ్యక్తం చేశారు.

Updated : 12 Jul 2023 16:06 IST

విజయవాడ: వాలంటీర్ల వ్యవస్థ పార్టీలకు అతీతంగా ప్రజల కోసం పని చేయాలని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. ప్రజల కోసం పనిచేసే ఏ వ్యవస్థ అయినా మంచిదే అని అభిప్రాయం వ్యక్తం చేశారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఎంపీ కేశినేని నాని రైతులకు రాయితీపై రెండో దశలో 25 ట్రాక్టర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాలంటీర్ల వ్యవస్థపై స్పందించారు. మంచి చేసే ఏ వ్యవస్థనైనా ప్రోత్సహించి కొనసాగిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు ఇప్పటికే చెప్పారని గుర్తు చేశారు. అధికార పార్టీ కోసం పనిచేయని వాలంటీర్లతో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు.

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే రైతు ఆనందంగా ఉండాలని.. అన్నదాతలు బాగుండాలనేదే తెదేపా ఆకాంక్షగా అని పేర్కొన్నారు. గతంలో రాయితీపై చంద్రబాబు రైతులకు ట్రాక్టర్లు అందించారని.. తెదేపా అధికారంలో లేకపోవడంతో రైతన్నలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రైతులను ఆదుకోవాలనే సదుద్దేశంతోనే రాయితీపై 1000 ట్రాక్టర్లను రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేస్తున్నామన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేశినేని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని