Raghurama: అమ‌రావ‌తిపై నిర్ణయాన్ని మార్చుకోవడం సరికాదు..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధానిగా అమ‌రావ‌తి కొన‌సాగుతుంద‌ని సీఎం జ‌గ‌న్ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు అన్నార‌ని

Updated : 21 Jun 2021 06:39 IST

న‌వ‌ప్ర‌భుత్వ క‌ర్తవ్యాలు పేరుతో జ‌గ‌న్‌కు ఎంపీ లేఖ‌ 

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధానిగా అమ‌రావ‌తి కొన‌సాగుతుంద‌ని సీఎం జ‌గ‌న్ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు అన్నార‌ని న‌ర్సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న జ‌గ‌న్‌కు లేఖ రాశారు. ఇప్ప‌టికే న‌వ‌ హామీలు- వైఫ‌ల్యాల పేరుతో సీఎంకు తొమ్మిది లేఖ‌లు రాసిన ఎంపీ.. న‌వ ప్ర‌భుత్వ క‌ర్త‌వ్యాలు పేరుతో మ‌రో 9 లేఖ‌లు రాస్తాన‌ని వెల్ల‌డించారు. ఇందులో భాగంగా ఆయ‌న ఇవాళ రాసిన లేఖ‌లో అమ‌రావ‌తిని కొన‌సాగించే విష‌యంపై ప్ర‌స్తావించారు.

పాద‌యాత్ర‌, ఎన్నిక‌ల ప్ర‌చారంలో అమ‌రావ‌తిపై జ‌గ‌న్ హామీ ఇచ్చార‌న్నారు. క‌నీసం 30 వేల ఎక‌రాల్లో రాజ‌ధాని ఉండాల‌ని సూచించార‌ని చెప్పారు. తీరా అధికారంలోకి వ‌చ్చాక నిర్ణయాన్ని మార్చుకోవడం సరికాదని ర‌ఘురామ అన్నారు. ప్ర‌జ‌లు ఇచ్చిన తీర్పును దుర్వినియోగం చేయొద్ద‌ని కోరారు. మూడు రాజ‌ధానుల‌పై సీఎం నిర్ణ‌యం అంద‌రినీ విస్మ‌యానికి గురి చేసింద‌ని ఎంపీ లేఖ‌లో పేర్కొన్నారు.

అమ‌రావ‌తికి భ‌విష్య‌త్తు లేకుండా చేశార‌ని ఎంపీ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. శాస‌న‌, న్యాయ‌, కార్య‌నిర్వ‌హ‌క వ్య‌వ‌స్థ‌లు ఒక‌దానికొక‌టి అనుసంధానించి ఉంటాయ‌ని అన్నారు. ఈ మూడు కార్య‌క‌లాపాలు ఒకే చోట ఉంటే ప్ర‌భుత్వంపై ఆర్థిక భారం త‌గ్గుతుంద‌ని లేఖ‌లో పేర్కొన్నారు. ప్ర‌పంచ స్థాయి హ‌రిత న‌గ‌రంగా తీర్చి దిద్దాల‌ని కోరుతూ రాజ‌ధాని అమ‌రావ‌తికి భూములు ఇచ్చిన రైతులు 550 రోజులుగా ఆందోళ‌న చేస్తున్నా ప్ర‌భుత్వం ప‌ట్టించుకోక‌పోవ‌డం దారుణ‌మ‌ని ర‌ఘురామ లేఖ‌లో ప్ర‌స్తావించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు