Nagababu: చంద్రబాబు అరెస్టుపై జనసైనికులు ఆవేదనతో ఉన్నారు: నాగబాబు

తెదేపా-జనసేన పొత్తను జనసైనికులు స్వాగతిస్తున్నారని జనసేన నేత నాగబాబు అన్నారు. ఆదివారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు అరెస్టు బాధ కలిగించిందన్నారు. 

Published : 24 Sep 2023 16:16 IST

తిరుపతి: తెదేపా-జనసేన పొత్తను జనసైనికులు స్వాగతిస్తున్నారని జనసేన నేత నాగబాబు అన్నారు. ఆదివారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు అరెస్టు బాధ కలిగించిందన్నారు. చంద్రబాబు అరెస్టుపై జన సైనికులు ఆవేదనతో ఉన్నారన్నారు. పవన్‌ను ఎవరైనా ప్యాకేజీ స్టార్‌ అంటే చెప్పుతో కొడతామని హెచ్చరిచారు. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో త్వరలో పవన్‌ ప్రకటిస్తారని చెప్పారు. భాజపాతో పొత్తుపై త్వరలో స్పష్టత వస్తుందన్నారు. రూ.కోట్ల ఆస్తులున్న పెద్ద నేతలు జనసేనకు అక్కర్లేదన్నారు. అవినీతి పరులు, అక్రమార్కులకు జనసేనలో సీట్లు ఇవ్వబోమని.. ప్రజా సేవకులకే సీట్లు ఇస్తామని  స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని