Nara lokesh-Yuvagalam: జగన్‌కు భయం పరిచయం చేసే బాధ్యత నాదే: నారా లోకేశ్‌

12వ రోజు యువగళం పాదయాత్రలో భాగంగా చిత్తూరులో నిర్వహించిన బహిరంగ సభలో వైకాపా విధానాలపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విరుచుకుపడ్డారు. 

Published : 07 Feb 2023 21:31 IST

చిత్తూరు: ముఖ్యమంత్రి జగన్‌ రాయలసీమకు పట్టిన శని అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. 12వ రోజు యువగళం పాదయాత్రలో భాగంగా చిత్తూరులో నిర్వహించిన బహిరంగ సభలో వైకాపా విధానాలపై లోకేశ్‌ విరుచుకుపడ్డారు. మోసానికి మానవ రూపం జగన్‌.. అందుకే జగన్‌ మోసపు రెడ్డి అని పేరు పెట్టామని తెలిపారు. చిత్తూరు జిల్లా యువతకు 20వేల ఉద్యోగాలు ఇచ్చే అమరరాజా సంస్థను కూడా పక్క రాష్ట్రానికి గెంటేశారని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్‌రెడ్డి పని అయిపోయిందని, తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందని.. అందరి సమస్యలు పరిష్కరిస్తుందని భరోసా ఇచ్చారు.

‘‘జగన్‌ జనం మధ్య తిరగలేకపోతున్నాడు. ప్యాలెస్‌ పిల్లి ఒకవేశ బయటకొచ్చినా పరదాలు కట్టుకుని తిరుగుతోంది. ప్రజాదరణతో మనం పబ్లిక్‌గా తిరుగుతన్నాం. మనది ప్రజాబలం. జనం ఆశీస్సులతో యువగళం పాదయాత్ర చేయగలుతున్నాం. నా ప్రచార రథం, మైక్‌ సీజ్‌ చేశారు. జగన్‌రెడ్డి నీకు తెలుగుదేశం అంటే ఎందుకు అంత భయం? తెలుగుదేశం మద్దతుదారులు, విద్యార్థులపై హత్యాయత్నం కేసులు పెట్టారు. కోర్టు చీవాట్లు పెట్టడంతో పోలీసులు విద్యార్థుల్ని వదిలేశారు. చట్టాలు ఉల్లంఘించి మరీ తెదేపా శ్రేణులపై అక్రమ కేసులు పెడుతున్న పోలీసు అధికారులపై మా ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయ విచారణ జరిపిస్తాం. తప్పుడు మార్గంలో చట్టాలు ఉల్లంఘించే పోలీసులకు తగిన గుణపాఠం చెబుతాం. జగన్‌ మోహన్‌రెడ్డికి అసలైన భయం పరిచయం చేసే బాధ్యత నాదే. 2024 తర్వాత జగన్‌ ఇంటి నుంచి అడుగు బయటపెట్టకుండా చేస్తా’’ అని లోకేశ్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని