Nara Lokesh: వైకాపా నేతలు ఉరవకొండను దోచేస్తున్నారు: లోకేశ్‌

లేపాక్షి నాలెడ్జ్‌ హబ్, సైన్స్‌ సిటీ పేరుతో వైకాపా ప్రభుత్వం సుమారు 17 వేల ఎకరాలు సేకరించిందని.. కానీ ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా?...

Published : 10 Mar 2024 14:29 IST

ఉరవకొండ: లేపాక్షి నాలెడ్జ్‌ హబ్, సైన్స్‌ సిటీ పేరుతో వైకాపా ప్రభుత్వం సుమారు 17 వేల ఎకరాలు సేకరించిందని.. కానీ ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా? అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రశ్నించారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో నిర్వహించిన ‘శంఖారావం’ సభలో ఆయన మాట్లాడారు. తెదేపా హయాంలో వందల కిలోమీటర్ల రోడ్లు వచ్చాయన్నారు. పెద్ద ఎత్తున తాగు, సాగునీటి పనులు జరిగాయని వివరించారు. 

‘‘ఉరవకొండలో 3 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఉరవకొండకు పయ్యావుల కేశవ్‌ మెగా డ్రిప్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు సాధించారు. జగన్‌ వచ్చాక ఇక్కడ పది శాతం పనులు కూడా జరగలేదు. వైకాపా నేతలు ఉరవకొండను దోచేస్తున్నారు. నకిలీ ఆధార్‌ కార్డులు, పత్రాలతో భూములు కాజేస్తున్నారు. ఉరవకొండలో 80 వేల ఎకరాలకు సాగునీరు ఇస్తామన్నారు.. కనీసం 8 ఎకరాలకైనా సాగునీరు ఇచ్చారా? తెదేపా-జనసేన అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలి. ప్రతి చెరువుకు నీరు, మెగా డ్రిప్‌ ఇరిగేషన్‌ తీసుకువస్తాం. మంగళగిరి మాదిరిగా ఉరవకొండ చేనేతలను ఆదుకుంటాం’’ అని నారా లోకేశ్‌ తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని