Pawan Kalyan: ఆ కాలేజీకి బటన్‌ నొక్కి బిల్డింగ్‌ కట్టించు జగన్‌: పవన్‌ విమర్శలు

వైకాపా సర్కార్‌పై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ట్విటర్‌ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. ఏలూరులో ప్రభుత్వ కళాశాల దుస్థితికి సంబంధించి ఆయన పలు ఫొటోలు షేర్‌ చేశారు.

Published : 10 Jul 2023 19:33 IST

ఏలూరు: వైకాపా సర్కార్‌పై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ట్విటర్‌ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. ఏలూరులో ప్రభుత్వ కళాశాల దుస్థితికి సంబంధించి ఆయన పలు ఫొటోలు షేర్‌ చేశారు. ‘‘చెట్ల కింద చదువులు చూడాలంటే ఎక్కడో మారుమూల పల్లెలకు వెళ్లాల్సిన అవసరం లేదు. జిల్లా కేంద్రం ఏలూరు నగరంలో ఉన్న ప్రభుత్వ కళాశాలకు వెళ్తే చాలు. పథకాలకు పేర్లు పెట్టుకోవడం మీద ఉన్న శ్రద్ధ కాలేజీ భవనం నిర్మించడంపై పెట్టాలి. 300 మంది చదువుతున్న ఈ కాలేజీకి బటన్‌ నొక్కి బిల్డింగ్‌ కట్టించు జగన్‌’’ అంటూ పవన్‌ ట్వీట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని