Chandrababu: శాంపిట్రోడా వ్యాఖ్యలను ఖండించిన చంద్రబాబు

దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా కనిపిస్తారంటూ కాంగ్రెస్‌ నేత శాంపిట్రోడా చేసిన వ్యాఖ్యలను తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) ఖండించారు.

Published : 09 May 2024 12:56 IST

అమరావతి: దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా కనిపిస్తారంటూ కాంగ్రెస్‌ నేత శాంపిట్రోడా చేసిన వ్యాఖ్యలను తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) ఖండించారు. నాగరిక సమాజంలో విభజన, జాత్యాహంకార వ్యాఖ్యలకు తావులేదన్నారు. భిన్నత్వంలో ఏకత్వం అనే భారత స్ఫూర్తిని అంతా నిలబెట్టాలని కోరారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌ (ట్విటర్‌)లో పోస్ట్‌ చేశారు.

‘‘దక్షిణ భారతీయులకు ప్రత్యేక గుర్తింపు, సంస్కృతి ఉన్నాయి. ఆఫ్రికన్లకు సొంత గుర్తింపు ఉంది. వ్యక్తుల గుర్తింపును శాంపిట్రోడా తగ్గించడం సిగ్గుచేటు. దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నా అందరం భారతీయులమే’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని