నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్లు

వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం గురువారంతో ముగియనుంది.

Published : 09 May 2024 06:21 IST

ఈనాడు, నల్గొండ: వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం గురువారంతో ముగియనుంది. శుక్రవారం నుంచి నామినేషన్ల పరిశీలన ప్రారంభం కానుండగా.. ఈ నెల 13 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. బుధవారం మరో 12 మంది అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేశారు. దీంతో నామినేషన్లు వేసిన వారి సంఖ్య 41కి చేరింది. గోండ్వానా దండకారణ్య పార్టీ నుంచి సోడే వెంకటేశ్వర్లు, సోషల్‌ జస్టిస్‌ పార్టీ నుంచి చెన్నా శ్రీకాంత్‌, తెలంగాణ రిపబ్లికన్‌ పార్టీ నుంచి గుండాల జ్యోతి, స్వతంత్ర అభ్యర్థులుగా పోతుల ప్రార్థన, తేజావత్‌ వాసుదేవ, యాతాకుల శేఖర్‌, దునుకుల వేలాద్రి, గుగులోతు సంతోష్‌, రత్నం ప్రవీణ్‌, జున్ను భరత్‌, గుగులోతు రాజునాయక్‌, పట్నం మల్లికార్జున్‌ తదితరులు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి దాసరి హరిచందనకు నామినేషన్లు అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని