తెదేపా, వైకాపా శ్రేణుల ఘర్షణ.. కుంకలగుంటలో పోలీసుల బందోబస్తు

జిల్లాలోని నకరికల్లు మండలం కుంకలగుంటలో తెదేపా, వైకాపా శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

Updated : 09 May 2024 09:31 IST

పల్నాడు: జిల్లాలోని నకరికల్లు మండలం కుంకలగుంటలో తెదేపా, వైకాపా శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తెదేపా నేతల ఇళ్ల వద్దకు వచ్చిన వైకాపా వర్గీయులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. తెదేపా నేత కనుమూరి బాజి చౌదరి లక్ష్యంగా ఈ కుట్ర చేశారు. వైకాపా నేతల కవ్వింపు చర్యలను తెదేపా కార్యకర్తలు తిప్పికొట్టారు. దీంతో ఇరు పార్టీల నేతల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి గ్రామంలో పికెట్‌ ఏర్పాటు చేశారు. ఓటమి భయంతోనే వైకాపా కుట్రలకు పాల్పడుతోందని కనుమూరి బాజి చౌదరి ఆరోపించారు. 

గురజాలలో తెదేపా సీనియర్‌ నేతపై దాడి

పల్నాడు జిల్లా గురజాల మండలం చర్లగుడిపాడులో తెదేపా సీనియర్ నేత పోట్ల లక్ష్మీనారాయణపై వైకాపా మూకలు దాడి చేశారు. బుధవారం రాత్రి గ్రామంలో కాసు మహేశ్‌ రెడ్డి పర్యటన అనంతరం వైకాపా శ్రేణులు రెచ్చిపోయాయి. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన లక్ష్మీనారాయణను చికిత్స నిమిత్తం గురజాల ఆసుపత్రికి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని