Payyavula Keshav: మరో కుంభకోణానికి తెరలేపిన వైకాపా: పయ్యావుల కేశవ్‌

సీమ కరవు నివారణ ప్రాజెక్టుల పేరుతో వైకాపా ప్రభుత్వం భారీ దోపిడీకి పాల్పడిందని తెదేపా నేత పయ్యావుల కేశవ్ ఆరోపించారు. విజయవాడలో పయ్యావుల మీడియాతో మాట్లాడారు.

Updated : 13 Jul 2023 19:19 IST

విజయవాడ: సీమ కరవు నివారణ ప్రాజెక్టుల పేరుతో వైకాపా ప్రభుత్వం భారీ దోపిడీకి పాల్పడిందని తెదేపా నేత పయ్యావుల కేశవ్ ఆరోపించారు. విజయవాడలో పయ్యావుల మీడియాతో మాట్లాడుతూ.. ‘‘పవన్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనుల కోసం రూ.3వేల కోట్లు అప్పు తెచ్చారు. ప్రభుత్వ ఖజానాకి రాకముందే దానిలో నుంచి  రూ.900 కోట్లు నేరుగా ప్రైవేటు కాంట్రాక్టర్‌కు చెల్లించారు. ప్రాజెక్టులకు ఎలక్ట్రో మెకానికల్‌ వర్క్స్‌ కోసమని అప్పులు తెచ్చారు. ఇన్ని అప్పులు తెచ్చినా.. ఆ పనులు మాత్రం జరగలేదు. జరిగిన కంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలి. తాజాగా దేశం నివ్వెరపోయేలా మరో కుంభకోణానికి ప్రభుత్వం తెరలేపింది. దీనిపై దశలవారీగా ఆధారాలను బయటపెడతాం’’ అని పయ్యావులు పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని