PM Modi: కాళేశ్వరం విషయంలో భారాసతో కాంగ్రెస్‌ కుమ్మక్కు: ప్రధాని మోదీ

వికసిత్‌ భారత్‌ కోసం తమ పార్టీ కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు.

Updated : 04 Mar 2024 14:12 IST

ఆదిలాబాద్‌: వికసిత్‌ భారత్‌ కోసం తమ పార్టీ కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు. ఆదిలాబాద్‌లో భాజపా (BJP) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘విజయ సంకల్ప సభ’లో ఆయన మాట్లాడారు. ఇది ఎన్నికల సభ కాదని.. అభివృద్ధి ఉత్సవమని చెప్పారు. 15 రోజుల్లో 5 ఎయిమ్స్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. ఆదివాసీ మహిళను రాష్ట్రపతిని చేశామన్నారు. త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో భాజపా 400 సీట్లు గెలవాలన్నారు. కాంగ్రెస్‌, భారాసపై ఈ సందర్భంగా మోదీ పలు విమర్శలు చేశారు.

‘‘భారాస ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం కుంగింది. ఈ విషయంలో ఆ పార్టీతో కాంగ్రెస్‌ కుమ్మక్కవుతోంది. గతంలో మీరు తిన్నారు.. ఇప్పుడు మేం తింటాం అన్నట్లు కాంగ్రెస్‌ పరిస్థితి ఉంది. భారాస పోయి కాంగ్రెస్‌ వచ్చినా పాలనలో ఎలాంటి మార్పు లేదు. రాష్ట్రంలో సమ్మక్క-సారక్క పేరుతో గిరిజన విశ్వవిద్యాలయాన్ని స్థాపించాం. 140 కోట్ల మంది ప్రజలే నా కుటుంబం. ప్రజల కలల సాకారం కోసం నేను పనిచేస్తా. మోదీ గ్యారంటీ అంటే.. కచ్చితంగా అమలయ్యే గ్యారంటీ. దేశంలో 7 మెగా టెక్స్‌టైల్‌ పార్కులు ఏర్పాటు చేయబోతున్నాం. అందులో ఒకటి తెలంగాణలో పెడతాం’’ అని మోదీ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని