BJP: ప్రజాధనంతో కట్టిన భవనాలను తాకట్టుపెట్టే అధికారం ఎవరిచ్చారు?: పురందేశ్వరి

రాష్ట్రంలో తాకట్టు పెట్టడానికి ఏదీ అనర్హం కాదన్నట్టు వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు.

Updated : 05 Mar 2024 22:11 IST

గుంటూరు: రాష్ట్రంలో తాకట్టు పెట్టడానికి ఏదీ అనర్హం కాదన్నట్టు వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు. గుంటూరులో జరిగిన భాజపా ప్రజాపోరు బహిరంగ సభలో ఆమె పాల్గొన్నారు. జగన్‌ ఏదో ఉద్ధరిస్తారని ప్రజలు నమ్మకంతో ఓట్లేసి గెలిపిస్తే ఐదేళ్లలో రాష్ట్ర ప్రజలపై రూ.12లక్షల కోట్ల అప్పుల భారం మోపారని ఆరోపించారు. 

రాష్ట్రంలో గనుల్ని తాకట్టుపెట్టి రూ.7వేల కోట్లు అప్పు తెచ్చారని, ఇప్పుడు రాష్ట్ర సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. ప్రజల సొమ్ముతో కట్టిన భవనాలను తాకట్టు పెట్టే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. నాసిరకం మద్యం ద్వారా మహిళల మంగళసూత్రాలు తెంచారని, నా ఎస్సీలు అని చెబుతూ దళిత డ్రైవర్‌ను చంపి డోర్‌ డెలివరీ చేశారని విమర్శించారు. వివేకా హత్యకేసులో న్యాయం జరగలేదని ఆయన కుమార్తె సునీత అడుగుతున్నారు.. జగన్‌ ఏం సమాధానం చెబుతారన్నారు. కార్యక్రమంలో భాజపా ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, గుంటూరు జిల్లా నేతలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని