Purandeswari: ఆర్థిక పరిస్థితిపై బుగ్గన చెప్పినవన్నీ అబద్ధాలే: పురందేశ్వరి

రాష్ట్రంలో అరాచక పాలన, కక్షపూరిత రాజకీయాలు నడుస్తున్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు.

Updated : 24 Sep 2023 15:30 IST

విశాఖపట్నం: రాష్ట్రంలో అరాచక పాలన, కక్షపూరిత రాజకీయాలు నడుస్తున్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. విశాఖలో భాజపా సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌ల సమావేశంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ, ఎంపీ జీవీఎల్‌తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడారు. 

‘‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రజలకు భాజపా వాస్తవాలు చెబితే.. దానిని ఖండించే క్రమంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నీ అబద్ధాలు చెప్పారు. వాస్తవాలను దాచి ప్రజలను మభ్యపెట్టేందుకు యత్నించారు. ప్రభుత్వ ఆస్తుల అమ్మకం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పీఎఫ్‌ వాడేయడం తదితర ఎన్నో అంశాలను దాచేందుకు ప్రయత్నాలు చేశారు. నాణ్యతలేని మద్యం విక్రయాల ద్వారా ప్రజల ఆరోగ్యంతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది. రాష్ట్రంలో అభివృద్ధి లేదు.. పరిశ్రమలు రావడం లేదు. పెట్టుబడుల మాట లేదు. మన బిడ్డల భవిష్యత్తుకు ఉపాధి కరవయ్యే పరిస్థితి నెలకొంది. 

క్షేత్రస్థాయిలో అందరికీ సమాచారం ఇవ్వడమే కాకుండా.. ప్రజలను ప్రభావితం చేసే శక్తి సోషల్‌ మీడియాకు ఉంది. మా నాన్న ఎన్టీఆర్‌ అప్పట్లో మహిళలకు ఆస్తి హక్కు ఇచ్చారు. ఇప్పుడు మోదీ సర్కార్‌ వారికి సంపూర్ణ సాధికారిత కల్పించేందుకు 33 శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చారు. అటువంటి నాయకత్వంలో పనిచేయడం ఆనందంగా ఉంది’’ అని పురందేశ్వరి అన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని