Raghurama: ర్యాలీలు రోడ్లపై కాకపోతే గాల్లో చేస్తారా?: ఎంపీ రఘురామ ఎద్దేవా

ఏపీలో రోడ్లపై సభలు, ర్యాలీలు, రోడ్‌ షోలపై రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయడంపై వైకాపా ఎంపీ రఘురామకృష్ణ రాజు (Raghurama) ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 03 Jan 2023 12:05 IST

అమరావతి: ఏపీలో రోడ్లపై సభలు, ర్యాలీలు, రోడ్‌ షోలపై రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయడంపై వైకాపా ఎంపీ రఘురామకృష్ణ రాజు (Raghurama) ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ (CM Jagan) కుటుంబం ఐదేళ్లు రోడ్లపైనే ర్యాలీలు, సభలు నిర్వహించిందని గుర్తుచేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 

‘‘మీతో పాటు కుటుంబంమంతా ఐదేళ్లు రోడ్లపైనే సభలు, ర్యాలీలు నిర్వహించారు. అధికారంలోకి వచ్చాక ఇప్పుడు రోడ్లపై ర్యాలీలు వద్దంటారా? ర్యాలీలు రోడ్లపై కాకపోతే గాల్లో చేస్తారా? మీరు తిరిగిన ఐదేళ్లలో గత ప్రభుత్వం నిషేధం విధించలేదే? చిన్న ఘటన కూడా జరగకుండా చూసిందే తప్ప.. అనుమతులు రద్దు చేయలేదే? రాజకీయ పార్టీల సభలకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం మీకు చేతకాదని అర్థం చేసుకోవాలా?’’ అని రఘురామ మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని