Kishan Reddy: రాబోయే రోజుల్లో భాజపాలో పెద్ద ఎత్తున చేరికలు: కిషన్‌రెడ్డి

గజ్వేల్‌ నియోజకవర్గం సీఎం కేసీఆర్‌ ప్రైవేటు ఆస్తి అనుకుంటున్నారా? అని కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మండిపడ్డారు. 

Published : 02 Sep 2023 17:48 IST

హైదరాబాద్‌: గజ్వేల్‌ నియోజకవర్గం సీఎం కేసీఆర్‌ ప్రైవేటు ఆస్తి అనుకుంటున్నారా? అని కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం కామారెడ్డి నుంచి గజ్వేల్‌కు వెళ్తున్న భాజపా నేత రమణారెడ్డి, కార్యకర్తలను అప్రజాస్వామికంగా అరెస్టు చేశారన్నారు. సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలువురు నేతలు శనివారం హైదరాబాద్‌లోని భాజపా కార్యాలయంలో కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్‌ సమక్షంలో పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ... రాబోయే రోజుల్లో భాజపాలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని జోస్యం చెప్పారు. గతంలో బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరగలేదని.. ఆ బాధ్యత భాజపా తీసకుంటుందని భరోసా ఇచ్చారు. ఎన్నికల నోటిఫికేషన్‌ రాక ముందే భారాస ప్రభుత్వం భాజపా నేతలను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. కామారెడ్డి నేతలు గజ్వేల్‌కు వెళ్తామంటే కేసీఆర్‌కు ఉలుకెందుకని ప్రశ్నించారు. గజ్వేల్‌లో కేసీఆర్‌ ఇచ్చిన హామీలన్నీ  అమలు చేస్తే భయమెందుకని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో రైతుల శక్తి, భారాస కథ ఎంటో రైతులు చూపిస్తారని ఎద్దేవా చేశారు. భారాస ప్రభుత్వంలో నేతలందరూ అన్నింట్లో కమీషన్‌లు, వాటాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కమీషన్‌ ప్రభుత్వం అయితే.. భారాస ప్రభుత్వం వాటాల ప్రభుత్వం అయ్యిందని కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని