TDP: తెదేపా ఎంపీ అభ్యర్థులపై కసరత్తు.. సాయంత్రం ప్రకటన?

తెదేపా (TDP) ఎంపీ అభ్యర్థుల ఎంపికపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) కసరత్తు చేస్తున్నారు.

Updated : 19 Mar 2024 12:12 IST

అమరావతి: తెదేపా (TDP) ఎంపీ అభ్యర్థుల ఎంపికపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) కసరత్తు చేస్తున్నారు. మంగళ, బుధవారాల్లోపు కొంతమందిని ప్రకటించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. పొత్తులో భాగంగా తెదేపాకు 144 ఎమ్మెల్యే స్థానాలు, 17 లోక్‌సభ సీట్లు కేటాయించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన కంటే ముందే 128 మంది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని తెలుగుదేశం ప్రకటించిన విషయం తెలిసిందే. మరో 16 మంది పేర్లను వెల్లడించాల్సి ఉంది. లోక్‌సభ అభ్యర్థుల్లో ఒక్కరినీ ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. 10 మందికి పైగా ఎంపీ అభ్యర్థులను చంద్రబాబు ఖరారు చేసినట్లు సమాచారం. మంగళవారం సాయంత్రమే వారి పేర్లు వెల్లడించే అవకాశమున్నట్లు తెదేపా వర్గాల ద్వారా తెలిసింది.

ఆ నినాదం రాష్ట్రమంతా ప్రతిధ్వనిస్తోంది: చంద్రబాబు

ఎన్డీఏ కూటమికి లోక్‌సభలో 400+ స్థానాలు, ఏపీలో 160కి పైగా ఎమ్మెల్యే సీట్లు అనే నినాదం రాష్ట్రమంతటా ప్రతిధ్వనిస్తోందని చంద్రబాబు అన్నారు. ఇది నవశకం ఆవిర్భావానికి సంకేతంగా పేర్కొన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు దృఢమైన నమ్మకంతో ఉన్నారని చెప్పారు. ఏపీలో తెదేపా, జనసేన, భాజపా కూటమి విజయం సాధించనుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్‌ (ట్విటర్‌)లో పోస్ట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని