Somireddy: చట్టాన్ని అడ్డుపెట్టుకుని మంత్రి కాకాణి భూ దోపిడీ: సోమిరెడ్డి

శాశ్వత భూ హక్కు చట్టాన్ని అడ్డుపెట్టుకుని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి దోపిడీ చేస్తున్నారని తెదేపా (TDP) సీనియర్‌ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి (Somireddy) విమర్శించారు.

Updated : 04 Jan 2024 16:24 IST

నెల్లూరు: శాశ్వత భూ హక్కు చట్టాన్ని అడ్డుపెట్టుకుని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి దోపిడీ చేస్తున్నారని తెదేపా (TDP) సీనియర్‌ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి (Somireddy) విమర్శించారు. సర్వేపల్లి నియోజకవర్గంలో రూ.1000 కోట్ల విలువైన భూములను దోచేశారని ఆయన ఆరోపించారు. నెల్లూరులోని తెదేపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సోమిరెడ్డి మాట్లాడారు. ఆర్టీఐ ద్వారా సేకరించిన వివరాలను ఆయన వెల్లడించారు. భూములను బినామీలకు మంత్రి రాసిచ్చేశారని ఆరోపించారు.

‘‘సర్వేపల్లి నియోజకవర్గంలో 5,445 ఎకరాలు పంపిణీ చేశామని మంత్రి కాకాణి చెబుతున్నారు. జాయింట్‌ కలెక్టర్ 3,300 ఎకరాలని అంటున్నారు. మిగిలిన భూమి ఏమైంది?వాస్తవాలు తెలిసేలా లబ్ధిదారుల పేర్లతో కూడిన భూ పంపిణీ జాబితాను బహిరంగంగా ప్రదర్శించాలి. గ్రామ సభలు నిర్వహించకుండానే భూములు పంపిణీ చేస్తారా? మంత్రి చేసిన అక్రమాలకు జిల్లా అధికారులు అండదండలు అందించారు. 10 రోజుల్లో జాబితాను బహిర్గతం చేయకుంటే జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడిస్తాం’’ అని సోమిరెడ్డి హెచ్చరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు