Nara Lokesh: ప్రత్యేక హోదా గురించి ఏనాడైనా కేంద్రాన్ని అడిగారా?: నారా లోకేశ్‌

ఎన్నికల ముందు 25 ఎంపీలు గెలిస్తే దిల్లీ మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామని చెప్పిన వైకాపా.. ఆ దిశగా కృషి చేసిందా? అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ప్రశ్నించారు.

Updated : 14 Feb 2024 16:11 IST

చినబొండపల్లి: ఎన్నికల ముందు 25 ఎంపీలు గెలిస్తే దిల్లీ మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామని చెప్పిన వైకాపా.. ఆ దిశగా కృషి చేసిందా? అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ప్రశ్నించారు. మన్యం జిల్లాలో జరిగిన శంఖారావం సభలో లోకేశ్‌ మాట్లాడారు. వైకాపాకు 22 మంది లోక్‌సభ, 9 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నప్పటికీ.. ప్రత్యేక హోదాపై ఏనాడైనా కేంద్రాన్ని అడిగారా?అని నిలదీశారు. వైకాపా నాయకులు సామాజిక బస్సు యాత్ర చేస్తున్నారని.. అసలు ఆ పార్టీలోనే సామాజిక అన్యాయం జరుగుతోందని విమర్శించారు. ఎన్నికల వేళ సీఎం జగన్‌ ఇప్పటివరకు 63 మంది ఎమ్మెల్యేలు, 16 మంది ఎంపీలను బదిలీ చేశారన్నారు. వారిలో 90 శాతం మంది బీసీ, ఎస్సీ నాయకులే ఉన్నారని లోకేశ్‌ ఆరోపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని