Ts News: ప్రభుత్వంపై రైతులు తిరగబడే పరిస్థితి వస్తుంది: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

వరి పంట విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులపై ఆంక్షలు విధించడాన్ని కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గాంధీ భవన్‌లో ఉత్తమ్‌ మీడియాతో

Updated : 24 Sep 2022 14:21 IST

హైదరాబాద్‌: వరి పంట విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులపై ఆంక్షలు విధించడాన్ని కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గాంధీ భవన్‌లో ఉత్తమ్‌ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌ ప్రభుత్వం రైతు వ్యతిరేక వైఖరిని అవలంబిస్తోందని ధ్వజమెత్తారు. గతంలో రాష్ట్రాన్ని రైస్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియాగా చేస్తానని సీఎం కేసీఆర్‌ చెప్పారని ఈ సందర్భంగా ఉత్తమ్‌ గుర్తు చేశారు. రైతులపై ఆంక్షలు పెట్టే హక్కు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడిదని నిలదీశారు. సిద్దిపేట కలెక్టర్‌ తీరును రైతు లోకమంతా గర్హిస్తోందన్నారు. ఇదే తీరు కొనసాగితే భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వంపై రైతులు తిరగబడే పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు. వరి రైతుల పక్షాన కాంగ్రెస్‌ పార్టీ పోరాడుతుందని ఉత్తమ్‌ స్పష్టం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని