TDP: నారా లోకేశ్‌ సమక్షంలో తెదేపాలో చేరిన సీఎం జగన్‌ సన్నిహితుడు

సీఎం జగన్‌ సన్నిహితుడు, ఎస్సీ కమిషన్‌ మాజీ సభ్యుడు బసవరావు గురువారం తెదేపాలో చేరారు.

Updated : 11 Apr 2024 18:53 IST

అమరావతి: సీఎం జగన్‌ సన్నిహితుడు, ఎస్సీ కమిషన్‌ మాజీ సభ్యుడు కట్టెపోగు బసవరావు గురువారం తెదేపాలో చేరారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా సమక్షంలో ఆయన పసుపు కండువా కప్పుకొన్నారు. మంగళగరి గ్రామీణ మండలం కురగల్లుకు చెందిన బసవరావు ఆధ్వర్యంలో పలువురు వైకాపా కార్యకర్తలు తెదేపాలో చేరారు. గతంలో జగన్‌కు సంఘీభావంగా ఇడుపులపాయ నుంచి విశాఖపట్నం వరకు ఆయన 2వేల కి.మీ పాదయాత్ర చేశారు. జగన్‌ విధానాలతో విభేదించి ఎస్సీ కమిషన్‌ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. చంద్రబాబు నేతృత్వంలో దళితుల అభివృద్ధి సాధ్యమని నమ్మి తాము తెలుగుదేశంలో చేరుతున్నట్లు వెల్లడించారు.

ఎస్సీల కోసం తెచ్చిన 27 పథకాలను జగన్ రద్దు చేశారని, 188 మంది ఎస్సీలను ఊచకోత కోశారని లోకేశ్‌ ఆరోపించారు. కూటమి వచ్చాక ఎస్సీలకు పూర్తి రక్షణ కల్పిస్తామని, దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎస్సీలకు అమలు చేసిన సంక్షేమ పథకాలన్నీ పునరుద్ధరిస్తామన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని