Ashes Test: ఆస్ట్రేలియా అమ్మాయికి ప్రపోజ్ చేసిన ఇంగ్లాండ్ అబ్బాయి.!

గబ్బా వేదికగా జరుగుతోన్న యాషెస్‌ టెస్టు సిరీస్‌ సందర్భంగా ఓ సరదా ఘటన చోటు చేసుకుంది. మొదటి టెస్టు మూడో రోజు తొలి సెషన్‌లో ఇంగ్లాండ్‌కు చెందిన రాబ్‌ అనే ఓ అభిమాని మోకాళ్లపై..

Updated : 10 Dec 2021 15:08 IST

ఇంటర్నెట్ డెస్క్‌: గబ్బా వేదికగా జరుగుతోన్న యాషెస్‌ టెస్టు సిరీస్‌ సందర్భంగా ఓ సరదా ఘటన చోటు చేసుకుంది. మొదటి టెస్టు మూడో రోజు తొలి సెషన్‌లో ఇంగ్లాండ్‌కు చెందిన రాబ్‌ అనే ఓ అభిమాని మోకాళ్లపై కూర్చుని.. ఆస్ట్రేలియాకు చెందిన నాట్‌కి ప్రపోజ్‌ చేశాడు. ‘గత నాలుగేళ్లుగా నీ కోసం ఎదురు చూస్తున్నాను. నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని అడిగాడు. ఊహించని ఈ పరిణామానికి మొదట కొంత అయోమయానికి గురైన నాట్.. తర్వాత అతడి ప్రపోజల్‌కు ఒప్పుకొంది. ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఎంత వైరం ఉన్నా.. వాటికి అతీతంగా ఒక్కటైన ఈ జంటను స్టాండ్స్‌లో ఉన్న అభిమానులు చప్పట్లు, కేరింతలతో ఉత్సాహపరిచారు. 2017-18లో మెల్‌బోర్న్‌ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన యాషెస్‌ సిరీస్ సందర్భంగా.. రాబ్, నాట్‌ల మధ్య ప్రేమాయణం మొదలైందట. ఆ సరదా ప్రపోజల్‌ వీడియోను మీరు చూసేయండి.!

Read latest Sports News and Telugu News



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని