మూడో టెస్టు వేదికపై సీఏ స్పష్టీకరణ

టీమ్‌ఇండియాతో మూడో టెస్టు వేదిక సిడ్నీయే అని క్రికెట్‌ ఆస్ట్రేలియా స్పష్టం చేసింది. నాలుగో టెస్టు కోసం సిడ్నీ నుంచి బ్రిస్బేన్‌ వెళ్లడం కష్టం కాబట్టి మూడో టెస్టును మెల్‌బోర్న్‌కు తరలిస్తున్నారన్న వదంతులను కొట్టిపారేసింది. అద్భుతంగా జరుగుతున్న ఈ టెస్టు సిరీసు షెడ్యూలు...

Published : 30 Dec 2020 01:41 IST

సిడ్నీ: టీమ్‌ఇండియాతో మూడో టెస్టు వేదిక సిడ్నీయే అని క్రికెట్‌ ఆస్ట్రేలియా స్పష్టం చేసింది. నాలుగో టెస్టు కోసం సిడ్నీ నుంచి బ్రిస్బేన్‌ వెళ్లడం కష్టం కాబట్టి మూడో టెస్టును మెల్‌బోర్న్‌కు తరలిస్తున్నారన్న వదంతులను కొట్టిపారేసింది. అద్భుతంగా జరుగుతున్న ఈ టెస్టు సిరీసు షెడ్యూలు, వేదికలను మార్చే ఉద్దేశం లేదని వెల్లడించింది.

ఎంసీజీ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించింది. బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీని 1-1తో సమం చేసింది. ఇందులో భాగంగానే జనవరి 7న సిడ్నీ వేదికగా మూడో టెస్టు జరగాల్సి ఉంది. ప్రస్తుతం అక్కడ కొవిడ్‌-19 కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడి నుంచి వస్తున్న వారిపై ఇతర రాష్ట్రాలు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. వారి ప్రవేశాలపై ఆంక్షలు అమలు చేస్తున్నాయి.  ఫలితంగా మూడో టెస్టు తర్వాత బ్రిస్బేన్‌ వెళ్లేందుకు ఆటగాళ్లకు కష్టమవుతుందని భావిస్తున్నారు.

‘కొవిడ్‌-19 మహమ్మారి వల్ల ఇబ్బందులు ఉన్నప్పటికీ అంతర్జాతీయ సిరీసుల షెడ్యూలును యథాతథంగా నిర్వహించేందుకు క్రికెట్‌ ఆస్ట్రేలియా కట్టుబడి ఉంది. సిడ్నీలో ప్రజారోగ్య పరిస్థితులు, సరిహద్దు ప్రవేశ ఆంక్షల గురించి మేం నిరంతరం చర్చిస్తున్నాం. సిడ్నీలో మూడు, బ్రిస్బేన్‌లో నాలుగో టెస్టు సురక్షితంగా, విజయవంతంగా నిర్వహించడంపై మేం ఆత్మవిశ్వాసంతో ఉన్నాం’ అని క్రికెట్‌ ఆస్ట్రేలియా తాత్కాలిక సీఈవో నిక్‌ హాక్లీ స్పష్టం చేశారు.

ఇవీ చదవండి
కంగారూలకు అప్పుడే షాకిచ్చాడు.. 
నోళ్లు మూయించిన రహానె సేన

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు