హైదరాబాద్‌ లక్ష్యం 168

షేన్‌ వాట్సన్ (42; 38 బంతుల్లో, 1×4, 3×6), అంబటి రాయుడు (41*, 34 బంతుల్లో, 3×4, 2×6) రాణించడంతో హైదరాబాద్‌కు చెన్నై 168 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ధోనీ సేన నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి

Published : 13 Oct 2020 21:18 IST

మెరిసిన వాట్సన్‌, రాయుడు.. 

ఇంటర్నెట్‌డెస్క్‌: షేన్‌ వాట్సన్ (42; 38 బంతుల్లో, 1×4, 3×6), అంబటి రాయుడు (41*, 34 బంతుల్లో, 3×4, 2×6) రాణించడంతో హైదరాబాద్‌కు చెన్నై 168 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ధోనీ సేన నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. డుప్లెసిస్ ఖాతా తెరవకముందే ఔటైనా.. ఓపెనర్‌గా అవతారమెత్తిన సామ్‌ కరన్‌ (31; 21 బంతుల్లో, 3×3, 2×6) మెరిశాడు. అయితే ఓపెనర్లను సందీప్‌ శర్మ పవర్‌ప్లేలోనే పెవిలియన్‌కు చేర్చి చెన్నైను దెబ్బతీశాడు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన రాయుడుతో కలిసి వాట్సన్‌ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. తొలుత నిదానంగా ఆడిన ఈ జోడీ.. తర్వాత గేర్‌ మార్చి బౌండరీల మోత మోగిస్తూ మూడో వికెట్‌కు 81 పరుగులు జోడించారు. అయితే దూకుడుగా ఆడే క్రమంలో వీరిద్దరు వరుస ఓవర్లలో పెవిలియన్‌కు చేరారు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన ధోనీ (21; 13 బంతుల్లో, 2×4, 1×6), జడేజా (25*, 10 బంతుల్లో, 3×4, 1×6) మెరుపులు మెరిపించడంతో చెన్నై 167 పరుగులు చేయగలిగింది. ఆఖరి ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన బ్రావో డకౌటయ్యాడు. హైదరాబాద్‌ బౌలర్లలో సందీప్‌ శర్మ (2/19), ఖలీల్ అహ్మద్‌ (2/45), నటరాజన్‌ (2/41) సత్తాచాటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని