Kohli: విరాట్ కోహ్లీని ‘డిఫరెంట్ లెవెల్’ అంటూ డివిలియర్స్ ట్వీట్‌‌.. దినేశ్‌ కార్తీక్ రిప్లై ఏమిచ్చాడంటే?

భారత స్టార్‌ ప్లేయర్‌ విరాట్‌ కోహ్లీ (Virat Kohli)ని ప్రశంసిస్తూ సౌతాఫ్రికా మాజీ క్రికెటర్‌ ఏబీ డివిలియర్స్‌ ‘డిఫరెంట్ లెవెల్’ అని ట్వీట్‌ చేయగా.. దానికి దినేశ్ కార్తీక్ ఆసక్తికరమైన రీతిలో రిప్లై ఇచ్చాడు. 

Published : 17 Jan 2023 01:38 IST

ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ (Virat Kohli) ఈ ఏడాదిని ఘనంగా ప్రారంభించి తన శతకాల దాహం తీర్చకుంటున్నాడు. శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో కోహ్లీ (166; 110 బంతుల్లో 13 ఫోర్లు, 8 సిక్స్‌లు) భారీ శతకం బాదాడు. లంకతో జరిగిన తొలి వన్డేలోనూ విరాట్ సెంచరీతో అలరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో  పలువురు మాజీ క్రికెటర్లు ‘కింగ్‌ కోహ్లీ’పై ప్రశంసలు కురిపిస్తున్నారు. దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ ఏబీ డివిలియర్స్‌ (AB De Villiers) కూడా విరాట్‌ని ప్రశంసించాడు. ‘విరాట్ కోహ్లీ! డిఫెరెంట్ లెవెల్’ అని ట్వీట్‌ చేశాడు.   
 
ఏబీడీ చేసిన ట్వీట్‌కి టీమ్‌ఇండియా వెటరన్ ఆటగాడు దినేశ్‌ కార్తీక్ (Dinesh Karthik) ఆసక్తికరమైన రీతిలో స్పందించాడు. ‘దీనిని వీర (VERA) లెవెల్‌ అంటారు. విరాట్‌ కోహ్లీని అడుగు దీని అర్థమేంటో చెప్తాడు. ఐపీఎల్‌లో కలుద్దాం’ అనే వ్యాఖ్యను జోడించి డివిలియర్స్‌ చేసిన ట్వీట్‌ని డీకే రీ ట్వీట్‌ చేశాడు. ఈ రెండు ట్వీట్‌లను చూసిన కోహ్లీ అభిమానులు లైక్‌లు కొడుతూ తమ మద్దతును తెలుపుతున్నారు. ఇక, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌ ద్వయం ఐపీఎల్‌లో బెంగళూరు తరఫున ఎన్నో మరుపురాని ఇన్నింగ్స్‌లు ఆడిన విషయం తెలిసిందే. ఏబీడీ గతేడాది ఏబీడీ ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. డీకే విషయానికొస్తే.. 2022 నుంచి ఆర్‌సీబీ తరఫున ఆడుతున్నాడు. ఐపీఎల్ 15 సీజన్‌లోనూ బెంగళూరుకే ప్రాతినిధ్యం వహించనున్నాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు