బెస్ట్‌ టీం ముంబయి.. ఫెవరేట్‌ మూమెంట్‌ క్రిస్‌గేల్‌

కరోనా నేపథ్యంలో యూఏఈలో జరిగిన టీ20 మెగా లీగ్‌ రెండు నెలల పాటు వినోదాన్ని పంచింది. జరుగుతుందో లేదో అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ యూఏఈలోని మూడు వేదికల్లో ఎప్పటిలాగే అలరించింది. ఈ క్రమంలో లీగ్‌పై డివిలియర్స్‌, లారా తమ

Updated : 29 Feb 2024 18:54 IST

టీ20 మెగా లీగ్‌పై డివిలియర్స్‌, లారా

 

దుబాయ్‌ : కరోనా నేపథ్యంలో యూఏఈలో జరిగిన టీ20 మెగా లీగ్‌ రెండు నెలల పాటు వినోదాన్ని పంచింది. జరుగుతుందో లేదో అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ యూఏఈలోని మూడు వేదికల్లో ఎప్పటిలాగే అలరించింది. ఈ క్రమంలో లీగ్‌పై డివిలియర్స్‌, లారా తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
టోర్నీ అంతటిలో క్రిస్‌గేల్‌ పునరాగమనం తన ఫెవరెట్‌ మూమెంట్‌ అని దిగ్గజ ఆటగాడు  లారా అన్నాడు. అస్వస్థత కారణంగా గేల్‌ సీజనులో తొలిఅర్ధభాగం మ్యాచులకు దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలో పంజాబ్‌ జట్టు ఏడు మ్యాచులాడి ఒకదాంట్లోనే విజయం సాధించింది. ఆ తర్వాత గేల్‌ జట్టులోకి రావడంతో పంజాబ్‌ జట్టు వరుస విజయాలను అందుకొని ఫ్లేఆఫ్‌ రేసులో నిలిచింది. ఈ సీజనులో ఏడు మ్యాచులాడిన గేల్‌ మూడు అర్ధశతకాలతో 288 పరుగులు చేశాడు. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచులో 99 పరుగుల వద్ద ఔట్‌ అయి సెంచరీ అందుకోలేకపోయాడు. 

ఈ ఏడాది సీజనులో బెస్ట్ టీం ముంబయే అని బెంగళూరు జట్టు స్టార్‌ ఆటగాడు డివిలియర్స్‌ అన్నాడు. తమ అద్భుత ప్రదర్శనతో మరోసారి టైటిల్‌ను కైవసం చేసుకున్న ముంబయి ఉత్తమ జట్టు అనడంలో ఎటువంటి సందేహం లేదు అని డివిలియర్స్‌ ట్వీట్‌ చేశాడు. మంగళవారం జరిగిన ఫైనల్‌ పోరులో తమ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో దిల్లీపై విజయం సాధించిన డిఫెడింగ్‌ ఛాంపియన్‌ ముంబయి కప్పు తన వద్దే నిలుపుకున్న విషయం తెలిసిందే.  

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని