AUS vs BAN: రాణించిన బంగ్లాదేశ్‌ బ్యాటర్లు.. ఆసీస్ ముందు భారీ లక్ష్యం

ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌ తలపడుతున్నాయి. ఈ రెండు జట్లకిది చివరి లీగ్ మ్యాచ్‌. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది.

Updated : 11 Nov 2023 14:31 IST

పుణె: ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌ తలపడుతున్నాయి. ఈ రెండు జట్లకిది చివరి లీగ్ మ్యాచ్‌. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. తౌహిద్‌ హృదౌయ్‌ (74; 59 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), నజ్ముల్ హొస్సేన్ శాంటో (45) రాణించారు. తాంజిద్ హసన్ (36), లిట్టన్ దాస్ (36), మహ్మదుల్లా (32), మెహదీ హసన్ మిరాజ్ (29), ముష్పీకర్ రహీమ్ (21) ఫర్వాలేదనిపించారు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా 2, సీన్ అబాట్ 2, మార్కస్ స్టాయినిస్ ఒక వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో ఓడినా ఆసీస్‌కు నష్టం లేదు. ఆరు విజయాలతో ఇప్పటికే ఆ జట్టు సెమీస్‌కు అర్హత సాధించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని