భారత్‌×ఇంగ్లాండ్‌: అంపైర్‌ తీరుపై వివాదం

చెపాక్‌ వేదికగా జరుగుతున్న భారత్‌×ఇంగ్లాండ్‌ రెండో టెస్టులో థర్డ్‌ అంపైర్ అనిల్ చౌదరి తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమీక్షలో అజింక్య రహానెను నాటౌట్‌గా ప్రకటించడంపై...

Published : 13 Feb 2021 22:52 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చెపాక్‌ వేదికగా జరుగుతున్న భారత్‌×ఇంగ్లాండ్‌ రెండో టెస్టులో థర్డ్‌ అంపైర్ అనిల్ చౌదరి తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమీక్షలో అజింక్య రహానెను నాటౌట్‌గా ప్రకటించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే... తొలి రోజు ఆటలో లీచ్‌ వేసిన 75వ ఓవర్‌లో అజింక్య రహానె ఔట్‌ అని ఇంగ్లాండ్ సమీక్షకు వెళ్లింది. అయితే థర్డ్‌ అంపైర్‌ పూర్తిగా పరిశీలించకుండా జింక్స్‌ను నాటౌట్‌గా ప్రకటించాడు.

బ్యాట్‌కు బంతి తగలడంపై మాత్రమే థర్డ్‌ అంపైర్‌ సమీక్షించాడు. కానీ రహానె గ్లవ్స్‌కు బంతి తగిలిందా అనే విషయాన్ని రివ్యూలో చూడలేదు. అయితే రహానె గ్లవ్స్‌కు బంతి తగిలి షార్ట్‌లెగ్‌లో ఉన్న ఫీల్డర్‌ చేతిలో పడిందని తర్వాత తెలిసింది. దీంతో ఐసీసీ నిబంధన 3.6.8 ప్రకారం.. కోల్పోయిన రివ్యూను పర్యాటక జట్టుకు తిరిగి ఇచ్చారు. సాంకేతిక లోపం కారణంగా రివ్యూని తిరిగి ఇవ్వడమే ఆ నిబంధన సారాంశం. అయితే తర్వాతి ఓవర్‌లోనే జింక్స్‌ ఔట్వవడంతో ఇంగ్లాండ్‌కు పెద్దగా నష్టమేమి జరగలేదు.

కానీ సమీక్షించడంలో విఫలమైన థర్డ్‌ అంపైర్‌పై ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ గ్లెన్ మాక్స్‌వెల్‌, వ్యాఖ్యాత హర్షా భోగ్లే అసంతృప్తి వ్యక్తం చేశారు. అంపైర్‌ పూర్తిగా విఫలమయ్యాడని అన్నారు. అంతేగాక రోహిత్ శర్మ స్టంపౌట్‌పై అంపైర్‌ తీసుకున్న నిర్ణయంపై కూడా భిన్న స్పందనలు వస్తున్నాయి. క్రీజులో రోహిత్‌ పూర్తిగా లేడని, అయినా ఔట్ ఇవ్వలేదని విమర్శిస్తున్నారు. మరికొందరు క్రీజులో ఉన్నాడని అంటున్నారు. కాగా, తొలి రోజు ఆట ముగిసేసరికి భారత్‌ 300/6తో నిలిచిన సంగతి తెలిసిందే. రోహిత్‌ (161), రహానె (67) రాణించారు.

ఇవీ చదవండి

హిట్‌మ్యాన్‌ షో.. భారత్‌ 300

రోహిత్ 97.. రితికా గుండె లబ్‌.. డబ్‌!



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని