IND vs AUS: ఉప్పల్‌ మ్యాచ్‌ టికెట్లు బ్లాక్‌లో అమ్ముకుంటున్నారు: క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఆందోళన

ఈ నెల 25న భారత్‌-ఆస్ట్రేలియా మధ్య ఉప్పల్‌ స్టేడియంలో జరగనున్న మ్యాచ్‌ టికెట్ల జారీలో జాప్యంపై క్రికెట్‌ అభిమానులు

Updated : 21 Sep 2022 13:54 IST

హైదరాబాద్‌: ఈ నెల 25న భారత్‌-ఆస్ట్రేలియా మధ్య ఉప్పల్‌ స్టేడియంలో జరగనున్న మ్యాచ్‌ టికెట్ల జారీలో జాప్యంపై క్రికెట్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్ (హెచ్‌సీఏ) వైఖరికి నిరసనగా నగరంలోని జింఖానా మైదానం వద్ద ఆందోళనకు దిగారు. మ్యాచ్‌ టికెట్ల కోసం తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన అభిమానులు.. బుధవారం ఉదయం నుంచి జింఖానా మైదానంలో పడిగాపులు కాస్తున్నారు.

టికెట్ల జారీ విషయంలో ఇంకా స్పష్టత రాకపోవడంతో అక్కడే నిరీక్షిస్తున్నారు. బ్లాక్‌లో టికెట్ల విక్రయాలను హెచ్‌సీఏ ప్రోత్సహిస్తోందని పలువురు ఆరోపించారు. టికెట్ల కోసం గత మూడు రోజులుగా జింఖానా మైదానానికి వస్తున్నా హెచ్‌సీఏ నుంచి ఎలాంటి స్పందనా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లు బుక్‌ చేసుకున్నప్పటికీ నగదును రిఫండ్‌ చేస్తున్నారని చెప్పారు. 55వేల సామర్థ్యం ఉన్న ఉప్పల్‌ స్టేడియంలో బ్లాక్‌లో టికెట్లు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. భారీగా అభిమానులు అక్కడికి చేరుకోవడంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. క్రికెట్‌ అభిమానుల ఆందోళన, బ్లాక్‌లో టికెట్లు అమ్ముకుంటున్నారనే ఆరోపణలపై హెచ్‌సీఏ అధికారులు స్పందించాల్సి ఉంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని