IPL 2021: ఆటగాళ్లపై చేస్తున్న ట్రోల్స్‌పై అసహనం వ్యక్తం చేసిన దినేశ్‌ కార్తిక్

ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఓటమి తర్వాత రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఆటగాళ్లపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ట్రోల్స్ పట్ల కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాడు దినేశ్ కార్తిక్‌ అసహనం వ్యక్తం చేశాడు. 

Published : 13 Oct 2021 02:13 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఆటగాళ్లపై ట్రోల్స్‌ వస్తుండడంపై కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆటగాడు దినేశ్‌ కార్తీక్‌ స్పందించాడు. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఓటమి తర్వాత రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఆటగాళ్లపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ట్రోల్స్ పట్ల దినేశ్ కార్తిక్‌ అసహనం వ్యక్తం చేశాడు. ఆటగాళ్లపై సోషల్‌ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్న వారికి వాటి ప్రభావం గురించి తెలియడం లేదన్నారు. ‘మీమ్స్‌, వీడియోలు, అసభ్యకర పదాల రూపంలో కొంతమంది సామాజిక మాధ్యమాల్లో పోస్టుల చేస్తున్నారని, ఆ క్షణంలో వారి మనసులో ఏమనిపిస్తే దాన్ని పోస్ట్‌ చేస్తున్నారని తెలిపారు. అవి ఆటగాళ్ల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతాయన్నాడు. 

ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓటమి తర్వాత బెంగళూరు ఆటగాళ్లు గ్లెన్‌ మాక్స్‌వెల్‌, డేనియల్ క్రిస్టియన్‌, అతని భార్యపై కొంతమంది సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు చేశారు. వీరికి కోల్‌కతా జట్టు అండగా నిలిచింది. ‘‘ ఆటగాళ్లను ద్వేషించడం ఆపండి. ఇటీవల ఆటగాళ్లు ఆన్‌లైన్‌ వేదికగా తరచూ దూషణకు గురవుతున్నారు. ఈ చర్యలకు వ్యతిరేఖంగా బలంగా నిలబడాల్సిన సమయం వచ్చింది. ఆటలో గెలుపోటములు అనేవి సహజం. మీకు అండగా మేమున్నాం అని ఆర్‌సీబీ ఆటగాళ్లను ఉద్దేశిస్తూ’’ దినేశ్‌ కార్తీక్‌ అన్నాడు. ఈ వీడియోను కోల్‌కతా నైట్ రైడర్స్ తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో పోస్ట్ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని