Sanju Samson: మళ్లీ జట్టులోకి సంజూ.. అభిమానులు ఖుషీ!

ఎట్టకేలకు సంజూ శాంసన్‌ (Sanju Samson) మళ్లీ భారత జట్టులోకి వచ్చాడు. అయితే, ఈసారి తన స్థానం నిలుపుకోవాల్సిన బాధ్యత అతడిపై ఉంది.

Published : 23 Jun 2023 17:30 IST

ఇంటర్నెట్ డెస్క్‌: విండీస్‌ పర్యటనకు (WI vs IND) ప్రకటించిన వన్డే జట్టులోకి సీనియర్‌ ఆటగాడు సంజూ శాంసన్‌ (Sanju Samson) వచ్చాడు.  జాతీయ జట్టు తరఫున గతేడాది నవంబర్‌లో చివరి మ్యాచ్‌ ఆడిన సంజూ మళ్లీ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. రోహిత్ శర్మ నాయకత్వంలో విండీస్‌తో రెండు టెస్టులు, మూడు వన్డేలను భారత్ ఆడనుంది. ఆ తర్వాత హార్దిక్‌ కెప్టెన్సీలోనూ ఐదు టీ20ల్లో తలపడనుంది. టీ20 జట్టును ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఇప్పటి వరకు 11 వన్డేలు ఆడిన సంజూ 66 సగటుతో 330 పరుగులు చేశాడు. అయినా, జట్టులో మాత్రం నిలకడగా స్థానం దొరకడం లేదు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలం కావడం సంజూకు మైనస్‌గా మారింది. ఇతర క్రికెటర్లకు వచ్చినన్ని అవకాశాలు మాత్రం సంజూకు రాలేదనేది కొందరి అభిప్రాయం. 

ఆసియా కప్‌, వన్డే ప్రపంచకప్‌లో చోటు దక్కాలంటే విండీస్‌ పర్యటన సంజూ శాంసన్‌కు చాలా ముఖ్యం. ఇందులో రాణిస్తే తప్పకుండా మెగా టోర్నీల్లో ఆడే అవకాశం వస్తుంది. ఈ క్రమంలో బీసీసీఐ తీసుకున్న నిర్ణయంపై నెట్టింట హర్షం వ్యక్తమవుతోంది. ఈసారి ఎలాగైనా రాణించి జట్టులో స్థానం సుస్థిరం చేసుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. అతడిని టెస్టుల్లోకి తీసుకోవాలని కోరుతున్నారు. దూకుడుగా ఆడే సంజూ ఇప్పటి వరకు చాలా తక్కువ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడటంపై ఏబీడీ, ఇయాన్‌ మోర్గాన్‌ ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఓ వీడియోను అభిమాని షేర్ చేశాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని