ఆమె ఒప్పుకుంది

పంజాబ్‌ కింగ్స్‌ చేతిలో చిత్తయిన సీఎస్కే ఆటగాళ్లు ఓటమి బాధలో మునిగిపోగా.. ఆ జట్టు పేసర్‌ దీపక్‌ చాహర్‌ మాత్రమే సంతోషంలో తేలిపోయాడు. మ్యాచ్‌ తర్వాత ఆటగాళ్లందరూ డ్రెస్సింగ్‌

Updated : 08 Oct 2021 14:42 IST

దుబాయ్‌: పంజాబ్‌ కింగ్స్‌ చేతిలో చిత్తయిన సీఎస్కే ఆటగాళ్లు ఓటమి బాధలో మునిగిపోగా.. ఆ జట్టు పేసర్‌ దీపక్‌ చాహర్‌ మాత్రమే సంతోషంలో తేలిపోయాడు. మ్యాచ్‌ తర్వాత ఆటగాళ్లందరూ డ్రెస్సింగ్‌ గదుల్లోకి వెళ్లగా.. దీపక్‌ మాత్రం స్టాండ్స్‌లోకి వచ్చాడు. తన గర్ల్‌ఫ్రెండ్‌ జయ భరద్వాజ్‌తో కాసేపు మాట్లాడిన అతను.. పెళ్లి ప్రతిపాదన చేశాడు. ఊహించని ఈ పరిణామానికి ఆశ్చర్యంతో పాటు ఆనందంలో మునిగిపోయిన జయ.. తన అంగీకారాన్ని తెలిపింది. దీపక్‌ను హత్తుకుని ముద్దులు పెట్టింది. ఆ తర్వాత ఈ ఇద్దరు స్టాండ్స్‌లోనే ఉంగరాలు మార్చుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని