మిక్స్‌డ్‌లో భారత్‌కు రజతం, కాంస్యం

ప్రపంచకప్‌ షూటింగ్‌లో భారత్‌ ఖాతాలో రెండు పతకాలు చేరాయి. మిక్స్‌డ్‌ ఎయిర్‌పిస్టల్‌ టీమ్‌ పెయిర్‌ విభాగంలో వరుణ్‌ తోమర్‌-రిథమ్‌ సాంగ్వాన్‌ రజతం గెలవగా.. ఎయిర్‌రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్లో రుద్రాంక్ష్ పాటిల్‌-నర్మద నితిన్‌ కాంస్యం సొంతం చేసుకున్నారు.

Published : 24 Mar 2023 03:26 IST

ప్రపంచకప్‌ షూటింగ్‌

భోపాల్‌: ప్రపంచకప్‌ షూటింగ్‌లో భారత్‌ ఖాతాలో రెండు పతకాలు చేరాయి. మిక్స్‌డ్‌ ఎయిర్‌పిస్టల్‌ టీమ్‌ పెయిర్‌ విభాగంలో వరుణ్‌ తోమర్‌-రిథమ్‌ సాంగ్వాన్‌ రజతం గెలవగా.. ఎయిర్‌రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్లో రుద్రాంక్ష్ పాటిల్‌-నర్మద నితిన్‌ కాంస్యం సొంతం చేసుకున్నారు. పిస్టల్‌ ఫైనల్లో వరుణ్‌-రిథమ్‌ 11-17తో క్విన్‌ వీయ్‌-లూ జిన్‌యావో (చైనా) చేతిలో ఓడి రజతం సాధించారు. ఆరంభంలో 7-15తో వెనుకబడ్డ భారత జంట.. ఆ తర్వాత పుంజుకుని 11-15తో ప్రత్యర్థిని సమీపించింది. కానీ చైనా ద్వయం వరుసగా రెండు పాయింట్లు నెగ్గి భారత్‌ జోడీ పోరాటానికి తెరదించింది. అంతకుముందు క్వాలిఫికేషన్లో క్విన్‌-జిన్‌యావో (586), వరుణ్‌-రిథమ్‌ (581) తొలి రెండు స్థానాల్లో నిలిచి ఫైనల్‌ చేరారు. ఇదే విభాగంలో పోటీపడిన దివ్య-శరభ్‌జ్యోత్‌ సింగ్‌ (574, 5వ స్థానం) కాంస్య పతక పోరుకు పాయింట్‌ దూరంలో ఆగిపోయారు. వెన్నికాంప్‌-జోసెఫ్‌ (జర్మనీ, 575) నాలుగో స్థానం సాధించి భారత జంటను వెనక్కి నెట్టారు. ఎయిర్‌రైఫిల్‌ కాంస్య పతక పోరులో రుద్రాంక్ష్-నర్మద 16-8తో జాంగ్‌-హోనాన్‌ (చైనా)ను ఓడించారు. అంతకుముందు క్వాలిఫికేషన్‌లో భారత జోడీ (632 పాయింట్లు) మూడో స్థానంలో నిలిచింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని