జ్యోతికకు స్వర్ణం

ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్‌ దండి జ్యోతిక శ్రీ మరోసారి మెరిసింది. గోపీచంద్‌ మైత్రా అథ్లెటిక్స్‌ ప్రాజెక్టుకు చెందిన ఆమె.. ఇండియన్‌ గ్రాండ్‌ ప్రి-2లో స్వర్ణంతో సత్తాచాటింది.

Published : 28 Mar 2023 03:08 IST

త్రివేండ్రం: ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్‌ దండి జ్యోతిక శ్రీ మరోసారి మెరిసింది. గోపీచంద్‌ మైత్రా అథ్లెటిక్స్‌ ప్రాజెక్టుకు చెందిన ఆమె.. ఇండియన్‌ గ్రాండ్‌ ప్రి-2లో స్వర్ణంతో సత్తాచాటింది. సోమవారం మహిళల 400 మీటర్ల పరుగులో ఛాంపియన్‌గా నిలిచింది. 53.56 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఐశ్వర్య (మహారాష్ట్ర- 54.09సె), విస్మయ (కేరళ- 54.95సె) వరుసగా రజత, కాంస్య పతకాలు నెగ్గారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని