హేజిల్‌వుడ్‌ సిద్ధం

భారత్‌తో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు ఆస్ట్రేలియా స్టార్‌ పేసర్‌ జోష్‌ హేజిల్‌వుడ్‌ సిద్ధమయ్యాడు.

Published : 23 May 2023 02:32 IST

మెల్‌బోర్న్‌: భారత్‌తో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు ఆస్ట్రేలియా స్టార్‌ పేసర్‌ జోష్‌ హేజిల్‌వుడ్‌ సిద్ధమయ్యాడు. అతడు ఫిట్‌నెస్‌ సాధించినట్లు.. ప్రాక్టీస్‌ మొదలెట్టినట్టు క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) ప్రకటించింది. ‘‘తాజాగా ఐపీఎల్‌లో అయిన గాయం నుంచి పేసర్‌ హేజిల్‌వుడ్‌ కోలుకున్నాడు. అతడు బౌలింగ్‌ ప్రాక్టీస్‌ మొదలుపెట్టాడు. త్వరలో జరగబోయే డబ్ల్యూటీసీ ఫైనల్‌తో పాటు యాషెస్‌ సిరీస్‌ కోసం జోష్‌ ప్రాక్టీస్‌లో మరింత తీవ్రత పెంచనున్నాడు’’ అని సీఏ వెల్లడించింది. ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తరఫున కేవలం మూడు మ్యాచ్‌లు ఆడి 9 ఓవర్లే వేసిన హేజిల్‌వుడ్‌.. గుజరాత్‌తో మ్యాచ్‌లో గాయపడ్డాడు. ఆ తర్వాత అతడు స్వదేశానికి వెళ్లిపోవడంతో డబ్ల్యూటీసీ ఫైనల్‌కు కూడా అందుబాటులో ఉండడనే అనుమానాలు తలెత్తాయి. కానీ అతడికి అయిన గాయం పెద్దది కాదని పరీక్షల్లో తేలింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు