World Cup 2023: 9 మ్యాచ్‌లు మారాయి

వచ్చే ప్రపంచకప్‌కు సంబంధించిన తొమ్మిది మ్యాచ్‌ల తేదీల్లో లేదా ఆరంభ సమయాల్లో మార్పులు జరిగాయి. భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌ను అక్టోబరు 15కు బదులుగా అక్టోబరు 14న నిర్వహించనున్నట్లు ఐసీసీ ఎట్టకేలకు ధ్రువీకరించింది.

Updated : 10 Aug 2023 09:47 IST

అక్టోబరు 14నే భారత్‌-పాక్‌ ప్రపంచకప్‌ మ్యాచ్‌

ముంబయి: వచ్చే ప్రపంచకప్‌కు సంబంధించిన తొమ్మిది మ్యాచ్‌ల తేదీల్లో లేదా ఆరంభ సమయాల్లో మార్పులు జరిగాయి. భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌ను అక్టోబరు 15కు బదులుగా అక్టోబరు 14న నిర్వహించనున్నట్లు ఐసీసీ ఎట్టకేలకు ధ్రువీకరించింది. నవంబరు 12న భారత్‌, నెదర్లాండ్స్‌ మధ్య బెంగళూరులో జరగాల్సిన మ్యాచ్‌ నవంబరు 11కు మారింది. ఈ మేరకు సవరించిన ప్రపంచకప్‌ షెడ్యూలును విడుదల చేశారు. భారత్‌, పాక్‌ మ్యాచ్‌ తేదీ మారనున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్‌, ఇంగ్లాండ్‌ జట్లకు సంబంధించి మూడేసి మ్యాచ్‌లను రీషెడ్యూలు (తేదీ లేదా సమయం) చేశారు. పాకిస్థాన్‌, శ్రీలంక మధ్య హైదరాబాద్‌లో అక్టోబరు 11న జరగాల్సిన మ్యాచ్‌ను ఇప్పుడిక అక్టోబరు 10న నిర్వహిస్తారు.

25 నుంచి టికెట్ల అమ్మకాలు: ఈ నెల 25 నుంచి వన్డే ప్రపంచకప్‌ టికెట్లు అమ్మనున్నారు. భారత్‌ లేని సన్నాహక మ్యాచ్‌లు, భారత్‌ లేని మ్యాచ్‌లకు అభిమానులు టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు. భారత్‌ మ్యాచ్‌ల టికెట్లు ఈ నెల 30 నుంచి సెప్టెంబరు 3 వరకు అందుబాటులో ఉంటాయి. సెమీఫైనల్స్‌, ఫైనల్‌ టికెట్లను సెప్టెంబరు 15 నుంచి అమ్ముతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని