ODI WC 2023: ఆరంభ వేడుకల్లేవ్‌!

ఇంకొక్క రోజులో మొదలయ్యే వన్డే ప్రపంచకప్‌కు ఆరంభ వేడుకలంటూ ఏమీ ఉండవని సమాచారం.

Updated : 04 Oct 2023 10:10 IST

అహ్మదాబాద్‌: ఇంకొక్క రోజులో మొదలయ్యే వన్డే ప్రపంచకప్‌కు ఆరంభ వేడుకలంటూ ఏమీ ఉండవని సమాచారం. ముందు రోజు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పది జట్ల కెప్టెన్లతో చిన్న కార్యక్రమం ఏర్పాటు చేయనున్న ఐసీసీ.. గురువారం నేరుగా ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ మధ్య జరిగే తొలి మ్యాచ్‌తోనే టోర్నీని లాంఛనంగా ఆరంభించనున్నట్లు తెలిసింది.


ప్రపంచకప్‌ రాయబారిగా సచిన్‌

దిల్లీ: క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌ను వన్డే ప్రపంచకప్‌ ‘గ్లోబల్‌ అంబాసిడర్‌’గా ఐసీసీ నియమించింది. ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ మధ్య ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌కు ముందు సచిన్‌ ట్రోఫీతో వస్తాడు.


రెస్ట్‌దే ఇరానీ కప్‌

రాజ్‌కోట్‌: రెస్టాఫ్‌ ఇండియా జట్టు ఇరానీ కప్‌ను చేజిక్కించుకుంది. మూడు రోజుల్లోనే ముగిసిన మ్యాచ్‌లో 175 పరుగుల తేడాతో రంజీ ఛాంప్‌ సౌరాష్ట్రను చిత్తు చేసింది. 255 పరుగుల లక్ష్యంతో మూడో రోజు, మంగళవారం బరిలోకి దిగిన సౌరాష్ట్ర.. ఎడమచేతి వాటం స్పిన్నర్‌ సౌరభ్‌ కుమార్‌ (6/43) ధాటికి 79 పరుగులకే కుప్పకూలింది. అంతకుముందు రెస్టాఫ్‌ ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో 160 పరుగులకే ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో రెస్ట్‌ 308, సౌరాష్ట్ర 214 పరుగులు చేశాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు