Rachin Ravindra: న్యూజిలాండ్‌ నుంచి అనుకోని హీరో..

ప్రపంచకప్‌ ఆరంభ మ్యాచ్‌ జరిగింది ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ మధ్య అయినా.. అందులో భారత్‌తో సంబంధం ఉన్న కుర్రాడు హీరోగా నిలిచాడు. అతనే.. రచిన్‌ రవీంద్ర

Updated : 06 Oct 2023 08:22 IST

ప్రపంచకప్‌ ఆరంభ మ్యాచ్‌ జరిగింది ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ మధ్య అయినా.. అందులో భారత్‌తో సంబంధం ఉన్న కుర్రాడు హీరోగా నిలిచాడు. అతనే.. రచిన్‌ రవీంద్ర. ఈ కుర్రాడు భారతీయుడు కాదు కానీ.. భారత సంతతికి చెందిన కుర్రాడే. రచిన్‌ కుటుంబం అతను పుట్టడానికి ముందే న్యూజిలాండ్‌లో స్థిరపడింది. అతను రెండేళ్ల కిందట, 21 ఏళ్ల వయసులోనే న్యూజిలాండ్‌ టీ20 జట్టులోకి వచ్చాడు. తర్వాత టెస్టు, వన్డే జట్లలోనూ చోటు సంపాదించాడు. రచిన్‌ నిజానికి ప్రపంచకప్‌లో ఆడాల్సిందే కాదు. అతను సెలక్టర్ల దృష్టిలోనే లేడు. కానీ స్పిన్‌ ఆల్‌రౌండర్‌ బ్రాస్‌వెల్‌ గాయపడి ప్రపంచకప్‌కు దూరం కావడంతో అనుకోకుండా రచిన్‌కు అవకాశం వచ్చింది. రచిన్‌ ప్రధానంగా స్పిన్నరే. లోయర్‌ మిడిలార్డర్లో అప్పుడప్పుడు మంచి ఇన్నింగ్స్‌ ఆడుతుంటాడు. అయితే పాకిస్థాన్‌తో వార్మప్‌ మ్యాచ్‌లో ఓపెనర్‌గా పంపితే అతనే 97 పరుగులు చేసి ఆశ్చర్యపరిచాడు. దీంతో ప్రపంచకప్‌ మ్యాచ్‌లో మూడో స్థానంలో ఆడిస్తే.. ఆ వ్యూహం అద్భుతంగా పని చేసింది. సంచలన ఇన్నింగ్స్‌తో అతను ఇంగ్లాండ్‌కు దిమ్మదిరిగే షాక్‌ ఇచ్చాడు. అనుకోకుండా ప్రపంచకప్‌లోకి వచ్చిన రచిన్‌.. తొలి మ్యాచ్‌లోనూ అనుకోని హీరోగా నిలిచాడు.

వన్డే చరిత్రలో తొలిసారి..

వన్డే క్రికెట్‌ చరిత్రలో ఎన్నడూ చూడని అరుదైన రికార్డు 2023 ప్రపంచకప్‌ ఆరంభ మ్యాచ్‌లో నమోదైంది. ఒక జట్టులో 11 మంది ఆటగాళ్లూ రెండంకెల స్కోర్లు నమోదు చేయడం గురువారమే జరిగింది. ఇంగ్లాండ్‌ జట్టులో ప్రతి ఆటగాడు పది దాటాడు. అత్యధికంగా రూట్‌ 77 పరుగులు సాధిస్తే.. మొయిన్‌ అలీ, వోక్స్‌ అత్యల్పంగా 11 చొప్పున పరుగులు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని