Virat-KL Rahul: విరాట్‌ వద్దనుకున్నాడు: రాహుల్‌

బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో సెంచరీ సాధిస్తానని కోహ్లి ఊహించలేదు. అవకాశం ఉన్నా వద్దనుకున్నాడు. కానీ కేఎల్‌ రాహుల్‌ పట్టుబట్టడంతో చివరకు కోహ్లి శతకాన్ని అందుకున్నాడు. ఈ విషయాన్ని మ్యాచ్‌ అనంతరం స్వయంగా రాహుల్‌ వెల్లడించాడు.

Updated : 20 Oct 2023 06:52 IST

బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో సెంచరీ సాధిస్తానని కోహ్లి ఊహించలేదు. అవకాశం ఉన్నా వద్దనుకున్నాడు. కానీ కేఎల్‌ రాహుల్‌ పట్టుబట్టడంతో చివరకు కోహ్లి శతకాన్ని అందుకున్నాడు. ఈ విషయాన్ని మ్యాచ్‌ అనంతరం స్వయంగా రాహుల్‌ వెల్లడించాడు. ‘‘కోహ్లి సింగిల్‌ తీసేందుకు ప్రయత్నిస్తే వద్దని చెప్పా. కానీ సింగిల్స్‌ తీయకుంటే బాగుండదని కోహ్లి అన్నాడు. వ్యక్తిగత మైలురాళ్ల కోసం ఆడుతున్నానని జనాలు భావిస్తారని చెప్పాడు. కానీ మనం ఎలాగో గెలుస్తామని, అలాంటప్పుడు సెంచరీ కోసం ప్రయత్నించడంలో తప్పులేదని కోహ్లీకి తెలిపా. సెంచరీ పూర్తిచేయమని చెప్పా’’ అని రాహుల్‌ పేర్కొన్నాడు. కోహ్లి 74 పరుగులతో ఉన్నప్పుడు.. జట్టు విజయానికి 27 పరుగులు కావాల్సి వచ్చింది. ఆ తర్వాత రాహుల్‌ ఒక్క బంతి మాత్రమే ఆడాడు. కోహ్లీకే సెంచరీ సాధించే అవకాశమిచ్చాడు. సింగిల్స్‌ కోసం కోహ్లి ప్రయత్నించినా రాహుల్‌ వెళ్లలేదు. 41 ఓవర్లు ముగిసే సరికి కోహ్లి 97తో ఉన్నాడు. జట్టు విజయానికి రెండు పరుగులే కావాలి. 42వ ఓవర్‌ తొలి బంతి లెగ్‌సైడ్‌ వెళ్లడంతో అంపైర్‌ వైడ్‌ ఇస్తాడా? అన్నట్లు కోహ్లి చూశాడు. కానీ కోహ్లి కాస్త లోపలికి జరిగాడని భావించి అంపైర్‌ వైడ్‌ ఇవ్వకపోవడంతో కోహ్లితో పాటు అభిమానులూ ఊరట చెందారు. మూడో బంతికి సిక్సర్‌తో కోహ్లి శతకం అందుకున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని