Shubman Gill: నంబర్‌వన్‌ దిశగా గిల్‌

భారత ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంకింగ్‌కు చేరువయ్యాడు. బుధవారం ప్రకటించిన ఐసీసీ వన్డే బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో 823 పాయింట్లతో గిల్‌ రెండో స్థానంలో నిలిచాడు.

Updated : 26 Oct 2023 09:44 IST

దుబాయ్‌: భారత ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంకింగ్‌కు చేరువయ్యాడు. బుధవారం ప్రకటించిన ఐసీసీ వన్డే బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో 823 పాయింట్లతో గిల్‌ రెండో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న బాబర్‌ అజాం (829- పాకిస్థాన్‌), గిల్‌ మధ్య తేడా ఆరు పాయింట్లు మాత్రమే. ప్రపంచకప్‌లో గిల్‌ నిలకడగా రాణిస్తే త్వరలోనే నంబన్‌వన్‌ ర్యాంకు సాధించడం ఖాయమే. డెంగీ  కారణంగా తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన గిల్‌.. తర్వాతి మూడింట్లో 95  పరుగులు రాబట్టాడు. బంగ్లాదేశ్‌పై అర్ధ సెంచరీ నమోదు చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని