Jasprit Bumrah: బుమ్రా ‘మౌనం’ ఎందుకు?

బుమ్రా ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ కలకలం రేపింది. అతడు ముంబయి ఇండియన్స్‌ను వీడనున్నాడనే ఊహాగానాలు చెలరేగాయి. ‘‘కొన్నిసార్లు మౌనంగా  ఉండడమే సరైన జవాబు’’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో బుమ్రా పెట్టిన పోస్ట్‌తో సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చమొదలైంది.

Published : 29 Nov 2023 08:45 IST

ముంబయి: బుమ్రా ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ కలకలం రేపింది. అతడు ముంబయి ఇండియన్స్‌ను వీడనున్నాడనే ఊహాగానాలు చెలరేగాయి. ‘‘కొన్నిసార్లు మౌనంగా  ఉండడమే సరైన జవాబు’’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో బుమ్రా పెట్టిన పోస్ట్‌తో సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చమొదలైంది. ముంబయి ఇండియన్స్‌ను అతడు అన్‌ఫాలో అయినట్లు చూపే స్క్రీన్‌షాట్లను కొందరు అభిమానులు పంచుకోగా.. అతడు ఆర్సీబీకి వెళ్లిపోయే అవకాశముందని కొందరు అభిప్రాయపడ్డారు. రోహిత్‌ శర్మ దిగిపోయాక కెప్టెన్‌ కావాలనుకున్న బుమ్రా.. తిరిగొచ్చిన హార్దిక్‌ పాండ్య తనకు అడ్డుగా మారతాడని భావిస్తున్నాడని ఇంకొందరు వ్యాఖ్యానించారు. బుమ్రా సాధారణంగా సోషల్‌ మీడియాలో చురుకుగా ఉండడు. ఐపీఎల్‌ కెరీర్‌ ఆరంభం (2015) నుంచి బుమ్రా, ముంబయి ఇండియన్స్‌తో ఉన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు