Ajinkya Rahane: 100 టెస్టులు ఆడతా: అజింక్య రహానె

టెస్టు క్రికెట్లో వంద టెస్టులు ఆడాలన్నది తన లక్ష్యమని, దాన్ని అందుకుంటానని టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్‌ అజింక్య రహానె విశ్వాసం వ్యక్తం చేశాడు. ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటనకు సెలక్టర్లు రహానెను విస్మరించారు.

Updated : 17 Jan 2024 08:25 IST

ముంబయి: టెస్టు క్రికెట్లో వంద టెస్టులు ఆడాలన్నది తన లక్ష్యమని, దాన్ని అందుకుంటానని టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్‌ అజింక్య రహానె విశ్వాసం వ్యక్తం చేశాడు. ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటనకు సెలక్టర్లు రహానెను విస్మరించారు. స్వదేశంలో ఇంగ్లాండ్‌తో అయిదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ప్రకటించిన తొలి రెండు టెస్టులకు ఎంపిక చేయలేదు. ప్రస్తుతం అతడు రంజీ ట్రోఫీలో ముంబయి జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అతడి సారథ్యంలో రెండు మ్యాచ్‌ల్లో ముంబయి ఘన విజయాలను అందుకుంది. ‘‘రంజీ ట్రోఫీ గెలవడం, టీమ్‌ఇండియాకు ఎంపిక కావడం ఇప్పుడు నా ముందున్న సవాళ్లు ఇవే. 100 టెస్టులు ఆడాలన్నది నా లక్ష్యం’’ అని చెప్పాడు. రహానె చివరగా నిరుడు జులైలో వెస్టిండీస్‌తో టెస్టు ఆడాడు. ఇప్పటివరకు అతడు 85 టెస్టుల్లో అతడు 38.46 సగటుతో 5077 పరుగులు చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని