CWG 2022: క్రికెట్లో అమ్మాయిలకు రజతమే

కామన్వెల్త్‌ క్రీడల్లో తొలిసారి ప్రవేశ పెట్టిన మహిళల క్రికెట్లో భారత జట్టు రజతంతో సరిపెట్టుకుంది. ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో హర్మన్‌ప్రీత్‌ సేన 9 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైంది.

Updated : 08 Aug 2022 04:04 IST

బర్మింగ్‌హామ్‌: కామన్వెల్త్‌ క్రీడల్లో తొలిసారి ప్రవేశ పెట్టిన మహిళల క్రికెట్లో భారత జట్టు రజతంతో సరిపెట్టుకుంది. ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో హర్మన్‌ప్రీత్‌ సేన 9 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైంది. 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌.. 19.3 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు షెఫాలి (11), స్మృతి (6) త్వరగా వెనుదిరిగినా.. జెమీమా (33)తో కలిసి హర్మన్‌ప్రీత్‌ (65) పోరాడడంతో 14 ఓవర్లకు 112/2తో భారత్‌ మెరుగైన స్థితిలో నిలిచింది. తర్వాత క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి లక్ష్యానికి దూరమైంది. గార్డ్‌నర్‌ (3/16), షట్‌ (2/27) భారత్‌ను దెబ్బ కొట్టారు. మొదట బెత్‌ మూనీ (61), మెగ్‌ లానింగ్‌ (36), గార్డ్‌నర్‌ (25) రాణించడంతో 8 వికెట్లకు 161 పరుగులు చేసింది. భారత బౌలర్లలో రేణుక సింగ్‌ (2/25), స్నేహ్‌ రాణా (2/38) సత్తా చాటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని