
T20 World Cup: ఓటమికి అతనొక్కడే కారణం కాదు : బాబర్ ఆజామ్
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్ రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై పాకిస్థాన్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఆసీస్ విజయంలో కీలకపాత్ర పోషించిన మాథ్యూ వేడ్ (41).. ఇచ్చిన క్యాచ్‌ను హసన్ అలీ వదిలేశాడు. దీంతో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న వేడ్.. తర్వాత వరుసగా మూడు సిక్సులు బాది జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఈ ఓటమిపై పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ స్పందించాడు.
‘మా జట్టులో హసన్ అలీ ప్రధాన బౌలర్. అతడు జట్టుకు ఎన్నో గొప్ప విజయాలు అందించాడు. వేడ్ ఇచ్చిన క్యాచ్‌ను ఒడిసిపట్టేందుకు శాయశక్తులా ప్రయత్నించాడు. కానీ, దురదృష్టవశాత్తు అందుకోలేకపోయాడు. ప్రతి మ్యాచ్‌లో రాణించడం ఎవరికీ సాధ్యం కాదు. కొన్ని సార్లు ఇలాంటి తప్పిదాలు జరుగుతుంటాయి. ప్రస్తుతం మేమంతా అతడికి అండగా ఉండాల్సిన అవసరం ఉంది. బయటి నుంచి వచ్చే విమర్శలను పట్టించుకోం’ అని బాబర్ పేర్కొన్నాడు. ప్రస్తుత టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఆరు మ్యాచ్‌లు ఆడిన హసన్ అలీ కేవలం ఐదు వికెట్లు మాత్రమే పడగొట్టాడు.
► Read latest Sports News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.