India vs Pakistan: బుమ్రాకు సర్‌ప్రైజ్‌ గిప్ట్ ఇచ్చిన పాకిస్థాన్ స్టార్‌ పేసర్

ఇటీవల తండ్రైన టీమ్‌ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)కు పాకిస్థాన్ స్టార్‌ పేసర్ షాహీన్ అఫ్రిది (Shaheen Afridi) సర్‌ప్రైజ్‌ గిప్ట్ ఇచ్చి ఆశ్చర్యపరిచాడు.

Published : 11 Sep 2023 02:37 IST

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల తండ్రైన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)కు పాకిస్థాన్ స్టార్‌ పేసర్ షాహీన్ అఫ్రిది (Shaheen Afridi) శుభాకాంక్షలు తెలియజేశాడు. అంతేకాదు సర్‌ప్రైజ్‌ గిప్ట్ ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. బుమ్రా, అతని కుటుంబసభ్యులు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించాడు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. ఆసియా కప్‌లో భాగంగా భారత్‌, పాకిస్థాన్‌ (India vs Pakistan) మధ్య సూపర్‌-4 మ్యాచ్‌లో ఈ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డు (PCB) ఎక్స్‌(ట్విటర్‌)లో పంచుకుంది. ఈ వీడియోను చూసి నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లతో మ్యాచ్‌ జరిగినంత సేపు మాత్రమే పోటీతత్వం ఉండాలని, అనంతరం సోదరభావంతో మెలగాలని కామెంట్లు చేశారు. మున్ముందు కూడా భారత్, పాక్‌ ఆటగాళ్ల మధ్య ఇలాంటి స్నేహపూర్వకమైన వాతావరణం ఉండాలని ఆకాంక్షించారు.

ధోనీ రనౌట్‌ వల్లే మేం ఫైనల్‌కు చేరుకోగలిగాం.. లేదంటే: కివీస్‌ పేసర్

బుమ్రా భార్య సంజనా గణేశన్‌ ఇటీవల పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ సమయంలో బుమ్రా తన భార్య చెంత ఉండేందుకు శ్రీలంక నుంచి ముంబయి వచ్చాడు. దీంతో నేపాల్‌తో మ్యాచ్‌కు దూరమైన అతడు.. పాక్‌తో సూపర్‌-4కు మ్యాచ్‌కు ముందు శ్రీలంకకు చేరుకున్నాడు. ఇక, భారత్, పాక్ సూపర్‌-4 మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో రిజర్వ్‌ డే (సెప్టెంబరు 11)కు) వాయిదా పడింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 24.1 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం కురవడంతో ఆటను నిలిపివేశారు. అనంతరం వర్షం తగ్గడంతో మ్యాచ్‌ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తుండగా మరోసారి వరుణుడు ఆటంకం కలిగించడంతో రిజర్వ్‌ డేకు వాయిదా వేశారు. రిజర్వ్‌ డే రోజు 24.1 ఓవర్ల నుంచే ఆట తిరిగి ప్రారంభమవుతుంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు