IPL 2021: ప్రతి మ్యాచ్‌ను ఫైనల్‌లాగే ఆడతాం: రషీద్ ఖాన్‌

త్వరలో పునఃప్రారంభం కానున్న ఐపీఎల్‌ మలి అంచెలో.. ప్రతి మ్యాచ్‌ను ఫైనల్‌లాగే ఆడతామని సన్‌రైజర్స్ హైదరాబాద్‌(ఎస్‌ఆర్‌హెచ్‌) ఆటగాడు రషీద్‌ ఖాన్‌ అన్నాడు. మిగతా మ్యాచుల్లో గెలిచి..

Published : 17 Sep 2021 22:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: త్వరలో పునఃప్రారంభం కానున్న ఐపీఎల్‌లో.. ప్రతి మ్యాచ్‌ను ఫైనల్‌లాగే ఆడతామని సన్‌రైజర్స్ హైదరాబాద్‌(ఎస్‌ఆర్‌హెచ్‌) ఆటగాడు రషీద్‌ ఖాన్‌ అన్నాడు. మిగతా మ్యాచుల్లో గెలిచి కచ్చితంగా ప్లేఆఫ్స్‌ చేరతామని ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘ఈ సీజన్‌ మొదటి దశలో మేం నిరాశపరిచాం. త్వరలో ప్రారంభం కానున్న మిగతా సీజన్‌లో పుంజుకుంటాం. ప్రతి మ్యాచ్‌ను ఫైనల్‌లాగే భావించి బరిలోకి దిగుతాం. చివరి ఓవర్లలో బ్యాట్‌తో రాణించి.. 20-25 పరుగులు చేయడం చాలా కీలకం. జట్టు విజయంలో అవి చాలా కీలకం. అందుకే, గత కొద్దికాలంగా బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాను. నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తూ రకరకాల షాట్లు నేర్చుకున్నాను. చాలా రోజులుగా ఇక్కడ ప్రాక్టీస్‌ చేస్తుండటంతో పిచ్‌ను బాగా అర్ధం చేసుకోగలిగాం. బంతులు ఎక్కడ వేయాలి? ఎలా వేయాలి? అనే విషయాలపై స్ఫష్టత వచ్చింది. పరిస్థితులను బట్టి బౌలింగ్‌ చేస్తే వికెట్లు రాబట్టవచ్చు’ అని రషీద్‌ ఖాన్‌ పేర్కొన్నాడు.

ఇప్పటి వరకు సన్‌రైజర్స్‌ ఆడిన ఏడు మ్యాచుల్లో కేవలం ఒకే మ్యాచులో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. వరుస ఓటముల నేఫథ్యంలో జట్టుకు నాయకత్వం వహిస్తున్న డేవిడ్‌ వార్నర్‌ని తొలగించిన యాజమాన్యం.. కేన్‌ విలియమ్సన్‌కు పగ్గాలప్పగించింది. అయినా సన్‌రైజర్స్‌ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని