Asian Champions Trophy: భారత జట్టుకు భారీగా నజరానా... మరి అవార్డులు ఎవరికంటే?

ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ చరిత్రలో భారత్‌ (Team India) నాలుగోసారి విజేతగా నిలిచింది. తాజాగా ప్రకటించిన అవార్డులను దక్కించుకోవడంలోనూ టీమ్‌ఇండియా ఆటగాళ్లు ముందువరుసలో నిలిచారు.

Published : 13 Aug 2023 12:51 IST

ఇంటర్నెట్ డెస్క్‌: నాలుగోసారి ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ (Asian Champions Trophy) విజేతగా భారత హాకీ జట్టు నిలిచింది. ఫైనల్‌లో మలేసియాపై 4-3 తేడాతో టీమ్‌ఇండియా విజయం సాధించింది. జట్టును గెలిపించిన ప్రతి ఆటగాడికి రూ. 3 లక్షలు, సహాయక సిబ్బందికి రూ. 1.50 లక్షలను నజరానాగా ఇస్తున్నట్లు హాకీ ఇండియా అధ్యక్షుడు డాక్టర్‌ దిలీప్‌ టిర్కే తెలిపారు. అలాగే భారత జట్టుకు రూ. 1.1 కోట్ల నజరానాను తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ప్రకటించారు. మినీ టోర్నీలో అవార్డులను దక్కించుకొన్న ఆటగాళ్లు, జట్ల వివరాలివే..

  • అత్యధిక టీమ్‌ గోల్స్‌ అవార్డు: ఛాంపియన్‌గా నిలిచిన భారత జట్టే ఈ అవార్డును సొంతం చేసుకుంది. మొత్తం 29 గోల్స్‌ చేసింది. ప్రత్యర్థులపై దూకుడుగా ఆడి చిత్తు చేస్తూనే భారీగా గోల్స్‌ చేయడం విశేషం. 
  • ఎమర్జింగ్‌ ప్లేయర్‌ అవార్డు: యువ ఆటగాళ్లకు మంచి వేదికగా మారిన ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఎమర్జింగ్‌ ప్లేయర్ అవార్డు పాకిస్థాన్‌ ఆటగాడు అబ్దుల్‌ షాహిద్‌ను వరించింది. ఆరు మ్యాచుల్లో రెండు గోల్స్‌ చేశాడు. 
  • అత్యుత్తమ రైజింగ్‌ గోల్‌కీపర్ అవార్డు: జపాన్‌ గోల్‌కీపర్ టకుమి కిటగావా అద్భుత ప్రదర్శన చేశాడు. గోల్‌పోస్టు వద్ద ప్రత్యర్థులను నిలువరించడంలో సఫలమయ్యాడు. జపాన్‌ మూడో స్థానంతో టోర్నీని ముగించడంలో కీలక పాత్ర పోషించాడు. దీతో అతడికి ‘బెస్ట్ రైజింగ్‌ గోల్‌కీపర్‌’ అవార్డు దక్కింది. 
  • బెస్ట్‌ గోల్‌ కీపర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్: దక్షిణ కొరియా పతకం సాధించడంలో విఫలమైనప్పటికీ.. ఆ జట్టు ఆటగాళ్లు మాత్రం మంచి ప్రదర్శనే ఇచ్చారు. అత్యుత్తమ గోల్‌కీపర్‌ అవార్డును దక్షిణ కొరియా ప్లేయర్ కిమ్ జేహియోన్ సొంతం చేసుకున్నాడు.
  • టాప్‌ స్కోరర్‌ ఇన్‌ ది టోర్నమెంట్: భారత్‌ నాలుగోసారి ఛాంపియన్‌గా నిలవడంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నీలో మొత్తం 9 గోల్స్‌ చేసిన హర్మన్‌కు ‘టాప్‌ స్కోరర్‌’ అవార్డు వరించింది. 
  • ప్లేయర్‌ ఆఫ్ ది టోర్నమెంట్: భారత ఆల్‌రౌండర్ మన్‌దీప్‌ సింగ్‌కు ఈ అవార్డు దక్కింది. మైదానంలో చురుగ్గా కదులుతూ జట్టును విజయపథంలో నడిపించాడు. మొత్తం ఏడు మ్యాచుల్లో మూడు గోల్స్‌ను మాత్రమే చేసినప్పటికీ ప్రత్యర్థి ఆటగాళ్లను గోల్స్‌ చేయకుండా అడ్డుకోగలిగాడు. 
  • ఫ్యాన్ ఛాయిస్‌ అవార్డు ఫర్ బెస్ట్‌ గోల్‌: మైదానంలో చురుగ్గా ఉంటూ ప్రత్యర్థులను ఏమార్చి గోల్‌ చేసే వారికి ఫ్యాన్స్‌ ఛాయిస్‌ ఫర్ బెస్ట్‌ గోల్‌ అవార్డు ఇస్తారు. ఇలా భారత ఆటగాడు సెల్వం కార్తి తన సొంత మైదానంలో బెస్ట్‌ గోల్‌ కొట్టడంతో ఈ అవార్డు వరించింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు