India vs Srilanka: గబ్బర్‌ సేన.. మొదలెట్టింది

శ్రీలంకలో పర్యటిస్తున్న భారత జట్టు సాధన షురూ చేసింది. క్వారంటైన్‌ ముగియడంలో శుక్రవారం తొలి సెషన్‌లో శిక్షణ పూర్తి చేసుకుంది. కుర్రాళ్లు ఉత్సాహంగా ఇందులో పాల్గొన్నారు. జులై 13 నుంచి శ్రీలంకతో టీమ్‌ఇండియా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనున్న సంగతి తెలిసిందే....

Published : 02 Jul 2021 20:12 IST

ద్రవిడ్‌ మార్గనిర్దేశంలో సాధన మొదలు

కొలంబో: శ్రీలంకలో పర్యటిస్తున్న భారత జట్టు సాధన షురూ చేసింది. క్వారంటైన్‌ ముగియడంలో శుక్రవారం తొలి సెషన్‌లో శిక్షణ పూర్తి చేసుకుంది. కుర్రాళ్లు ఉత్సాహంగా ఇందులో పాల్గొన్నారు. జులై 13 నుంచి శ్రీలంకతో టీమ్‌ఇండియా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనున్న సంగతి తెలిసిందే.

లంక పర్యటన కోసం బీసీసీఐ కుర్రాళ్లతో కూడిన జట్టును ఎంపిక చేసింది. సోమవారం కొలంబోకు చేరుకున్న గబ్బర్‌ సేన మూడు రోజులు క్వారంటైన్‌లో గడిపింది. చేతన్‌ సకారియా, కృష్ణప్ప గౌతమ్‌, నితీశ్ రాణా, దేవదత్‌ పడిక్కల్‌, వరుణ్‌ చక్రవర్తి, రుతురాజ్‌ గైక్వాడ్‌ అరంగేట్రం కోసం ఎదురు చూస్తున్నారు. పృథ్వీషా, ఇషాన్‌ కిషన్‌, సంజు శాంసన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ టీ20 ప్రపంచకప్‌కు ఎంపికవ్వాలని పట్టుదలతో ఉన్నారు. బీసీసీఐ సాధనకు సంబంధించిన చిత్రాలను ట్విటర్‌ ద్వారా పంచుకుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని