David Warner: వార్నర్‌ చివరి టెస్టు.. ఖవాజా ఆప్యాయంగా కౌగిలింత.. పాక్‌ ‘గార్డ్‌ ఆఫ్‌ ఆనర్’

తన కెరీర్‌లో చివరి టెస్టు మ్యాచ్‌ ఆడుతున్న డేవిడ్ వార్నర్‌కు (David Warner) అద్భుతమైన గౌరవం దక్కింది. పాకిస్థాన్‌ ఆటగాళ్లు అతడిని అభినందిస్తూ ‘గార్డ్‌ ఆఫ్‌ ఆనర్‌’ ఇచ్చారు.

Updated : 03 Jan 2024 17:17 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాటర్ డేవిడ్ వార్నర్ (David Warner) తన చివరి టెస్టు మ్యాచ్‌ ఆడుతున్నాడు. సిడ్నీ వేదికగా పాకిస్థాన్‌తో (AUS vs PAK) జరుగుతున్న మూడో టెస్టులో బ్యాటింగ్‌కు వచ్చిన సమయంలో వార్నర్‌కు పాక్‌ ప్లేయర్లు గౌరవ వందనం చేశారు. కెప్టెన్‌ మసూద్‌, వికెట్‌ కీపర్‌ రిజ్వాన్‌ సహా ప్రతి ఒక్కరూ వార్నర్‌కు అభినందనలు తెలిపారు. బ్యాటింగ్‌కు వస్తున్న సమయంలో సహచర ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా కూడా వార్నర్‌ను ఆప్యాయంగా కౌగలించుకున్నాడు. 

తొలి రోజు ఆట ముగిసేసమయానికి ఆసీస్ వికెట్‌ నష్టపోకుండా ఆరు పరుగులు చేసింది. క్రీజ్‌లో డేవిడ్ వార్నర్ (6*), ఉస్మాన్ ఖవాజా (0*) ఉన్నారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ 313 పరుగులకు ఆలౌటైంది. మరోసారి ఆసీస్‌ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (5/61) ఐదు వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టాడు. పాక్‌ బ్యాటర్లు మహమ్మద్ రిజ్వాన్ (88), ఆమిర్ జమాల్ (82), అఘా సల్మాన్‌ (53) హాఫ్ సెంచరీలు సాధించారు. షాన్‌ మసూద్‌ 35, బాబర్ అజామ్‌ 26, సాజిద్‌ ఖాన్ 15, మిర్‌ హమ్జా 7, సౌద్‌ షకీల్ 5 పరుగులు చేశారు. ఓపెనర్లు షఫీక్‌, సైమ్‌ అయుబ్‌తోపాటు హసన్‌ అలీ డకౌట్‌ కావడం గమనార్హం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని